Telangana Kitchen: సూపర్ స్నాక్స్ ... వెరైటీ బ్రేక్ ఫాస్ట్.. ఇలా తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.. పిల్లలు లొట్టలేస్తారు.. !

Telangana Kitchen:  సూపర్ స్నాక్స్ ... వెరైటీ బ్రేక్ ఫాస్ట్..  ఇలా తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.. పిల్లలు లొట్టలేస్తారు.. !

పిల్లలకు పోషకాహారం.. పౌష్ఠికాహారం అందించడం.. తల్లులకు  కత్తిమీద సాములా తయారైంది.  పిల్లలకు ఏం వండి పెట్టాలా అనేది తల్లుల ముందు రోజూ ఉండే అతి పెద్ద ఫజిల్ గా మారింది. రోజు తినేవే అయినా వెరైటీగా చేయకపోతే నసేమిరా తినమంటారు.. అందుకని రెగ్యులర్ గా చేసే వాటినే కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తే... వాళ్లు ఇష్టంగా తింటారు.

తీపి పరాటాలు తయారీకి కావలసినవి

  •  గుమ్మడి లేదా క్యారెట్ తురుము లేదా కొబ్బరి లేదా యాపిల్ తురుము పనీర్ క్రంజెల్స్
  • బెల్లం 
  • చిక్కటి బెల్లం పాకం లేదా డేట్స్ సిరప్
  •  యాలకుల పొడి

తయారీ విధానం : పెనం వేడి చేసి పరాటాలను వేడిచేయాలి . ఒక పక్క కాలిన తరువాత రెండో
వైపు తిప్పి బెల్లంతో కలిపి మిగతా పదార్థాలన్నింటినీ దాని మీద చల్లాలి. దాన్ని వెనక్కి తిప్పి కాల్బాలి. బెల్లం కరగడం మొదలవుతుంది. మిగతా పదార్థాలన్నికలిసి ఉడుకుతాయి. రెండు మూడు నిమిషాలు ఉడికించాక బెల్లం బాగా కరిగిపోయి తేమ బయటికి వస్తుంది. 

మిశ్రమం అంతా చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.  జిగటగా బయటకు బుడగలు వస్తుంటాయి.  అప్పుడు మళ్లీ వెనక్కి తిప్పి మిశ్రమాన్ని పకాటా అంతటా సమంగా పరవాలి. సన్నటి  మంట మీద మరోరెండు నిమిషాలుకించాలి. బయటివైపు కాస్త బెల్లం తురుము చల్లితే బయటి వైపు కాస్త క్రంచీగా వస్తుంది  తరువాత వీటిని రోల్ చేయాలి. 

కలిసిపోయి ఉండేందుకు టూత్ పిక్ గుచ్చాల్సిన అవసరం లేదు. బెల్లం ఉంటుంది కాబట్టి అతుక్కుని పోయి ఉంటుంది. లోపలి మిశ్రమం చాలా వేడిగా ఉంటుంది. అంత త్వరగా చల్లారదు. అందుకనిపిల్లలకు పెట్టే ముందు వేడి వేడిగా ఇవ్వకండి బాగా చల్లారాకనే తినేందుకు ఇవ్వండి.

నోట్: వాడుతుంటే ఎక్కువగా ఉడికించొద్దు. అలాచేస్తే పనీర్ రబ్బర్ బవుతుంది. తినేందుకు బాగుండదు. ఎవరికి కావాల్సినంత కొలతలు వాళ్లు తీసుకోవచ్చు.


వెజ్​ పోహా కట్​ లెట్​ తయారీకి కావలసినవి

  •  అటుకులు-ఒక కప్పు 
  • ఆలుగడ్డలు (ఉడికించి, పొడి పొడిగా చేసి)-రెండు
  • ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి)
  •  కొత్తిమీర తరుగు - పావుకప్పు 
  • చాట్​ మసాలా - అర టేబుల్ స్పూన్
  •  నువ్వులు- ఒక టీస్పూన్
  •  కారం - ఒక టేబుల్ స్పూన్
  •  పచ్చిమిర్చి- ఒకటి  ( సన్నగా తరిగి) 
  •  గరం మసాలా.. ఆంచూర్.. వేగించిన జీలకర్ర పొడి- అరటీస్పూన్ 
  • మొక్క జొన్నపిండి - ఒక టేబుల్ స్పూన్
  •  ఉప్పు- రుచికి సరిపడా

తయారీ విధానం : అటుకుల్ని నీళ్లు తేటగా వచ్చే వరకు కడగాలి పదినిమిషాలు పక్కన పెడితే అటుకులు మెత్తగా అవుతాయి ఆ తరువాత చేతివేళ్లతో నలపాలి. మొక్కజొన్న పిండి, మెదిపిన అలుగడ్డలు వేసి కలపాలి కారం... చాట్ మసాలా ఆంచూర్,వేగించిన జీలకర్ర పొడి, గరం మసాలా పచ్చిమిర్చి తరుగు, నువ్వులు, ఉల్లి తరుగు. కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి మెత్తటి ముద్దలా కలపాలి .  

ఇప్పుడు ముద్ద నుంచి కొంత పిండిని చేతిలోకి తీసుకుని అరచేతిలో పెట్టుకుని అదిమినట్టు చేయాలి. ఇలా కొన్నింటిని చేయాలి.  వీటి ఆకారాలను మీకు నచ్చినట్టు చేయొచ్చు. 

►ALSO READ | Tasty Food: బనానాతో భలే టేస్ట్ స్నాక్స్.. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది...

పగుళ్లు లేకుండా చూడాలి తరువాత తడిచేసుకున్న చేత్తో వాటి మీద తట్టాలి. బుజియా చేసిన గిన్నెలో ఈ రోటీను వేసి దొర్లించాలి. తరువాత నున్నితంగా వత్తాలి.  లోతుగా ఉన్న పాన్​ లో  నూనె వేడిచేయాలి. ఓ మాదిరి వేడికి వచ్చాక కట్​ లెట్ ను రోజు వాటిమీద ఉంచాలి. బంగారు రంగు. వచ్చే వరకు వేగించాలి . కిచెన్ టవల్ మీద వీటిని తీసి తరువాత ఒక ప్లేట్ లోకి  తీయాలి.వీటిని గ్రీన్ చట్నీతో లేదా కెచప్ తో తింటే యమ్మీగా ఉంటాయి

ఆలూ శాండ్ విచ్​తయారీకి కావలసినవి

  • బ్రెడ్​– నాలుగు స్లయిస్​ లు
  • నెయ్యి లేదా బటర్- ఒక టేబుల్ స్పూన్
  •  ఆలుగడ్డ ఒకటి పెద్దది (ముక్కలు తరిగి)
  •  నెయ్యి లేదా నూనె- ఒక టీస్పూన్
  •  అల్లం తరుగు - అర టీస్పూన్
  •  కారం-పావు టీస్పూన్
  •  గరం మసాలా- రెండు చిటికెలు
  •  ధనియాల పొడి పావు టీస్పూన్
  •  ఉప్పు - సరిపడా
  •  కొత్తిమీర తరుగు-కొంచెం
  •  పచ్చిమిర్చి - ఒకటి (తరుగు) 
  • నిమ్మరసం లేదా ఆమ్ చూర్ పొడి- సరిపడా

తయారీవిధానం: ఆలుగడ్డను శుభ్రంగా కడిగి తొక్క తీసేయాలి. లేదా కాస్త అటుఇటుగా ఉడికించి తొక్క తీసేయాలి . అలుగడ్డను చేతితో నలపాలి. వెన్న తెప్పించి పైన చెప్పిన వాటిలో మిగతా వాటన్నింటినీ వేసి బాగా కలపాలి .  బ్రెడ్ స్లయిస్ మీద ఒకవైపు బటర్ రాసి గ్రిల్ మీద లేదా తవా మీద వేడిచేయాలి తరువాత ఆలు మిశ్రమాన్ని బటర్ పూయని వైపు ఉంచాలి. మరో బ్రెడ్ స్లయిస్ తో కప్పి మూడు నుంచి ఐదు నిమిషాలు గ్రిల్ చేయాలి. లేదా తవా మీద వేడి చేయా. రెడీ  అయిన ఆలూ శాండ్​ విచ్ ను గ్రీన్ చట్నీతో లాగిస్తే  ఆహా ఏమి రుచిరా అని పాట పాడాల్సిందే మరి...!

వెజ్​ ర్యాప్స్​ తయారీకి కావలసినవి:

గోధుమపిండి లేదాటోర్భిల్లాలతో వీటిని తయారుచేయొచ్చు.ఇవి బ్రేక్ ఫాస్ట్​గా బాగా  ఉపయోగపడతాయి.

 

  • గోధుమ పిండి చపాతీలు- నాలుగు
  •  ఒక క్యారెట్ తురుము
  •  ఒక ఉల్లిపాయ- (సన్నగా తరిగి)
  •  ఒక టొమాటో- (గింజలు తీసి సన్నటి ముక్కలుగా తరిగి)
  •  క్యాబేజీ- ఇష్టపడినంత 
  • ఒక పచ్చిమిర్చి -పెద్ద ముక్కలు తరిగి (పిల్లల కోసం కాబట్టి కారం అనిపిస్తుందనుకుంటే వాడకపోయినా పర్వాలేదు)
  • గ్రీన్ చట్నీ లేదా సాస్: (చపాతీ మీద పూసేందుకు)
  • చీజ్ లేదా మయోనేజ్- పావు కప్పు
  •  వెల్లుల్లి రెబ్బలు -రెండు (తరిగి)
  •  నిమ్మరసం- సరిపడా
  •  మిరియాల పొడి- సరిపడా
  •  ఆవ పిండి పావు లేదా అర టీస్పూన్
  •  ఉప్పు - సరిపడా (మయోనేజ్​  లో ఉప్పు ఉంటే ఉప్పు వేయకపోయినా సరిపోతుంది) 
  • అలివ్ నూనె-రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:కూరగాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలు తరగాలి.చీజ్ ను వెల్లుల్లి  ఆవాలు, మిరియాలు, నిమ్మరసం లను ఒక గిన్నెలో తీసుకుని కలపాలి ఒకవేళ గ్రీన్ చట్నీ వాడుతుంటే కనుక ఈ మిశ్రమం తయారు చేసుకోకపోయినా పర్వాలేదు.చపాతీ మీద లెట్లూస్ పెట్టి అందులో తరిగిన కూరగాయ ముక్కలు వేయాలి.తరువాత చపాతీని రోల్ చేసి ఒక చివరను మూసేయాలి. చీజ్ లేదా మయో వాడితే తయారు చేసిన రెండు గంటల్లోపే తినేయాలి. గ్రీన్​ చట్నీ వాడితే కొన్ని గంటలు ఉన్నా పర్వాలేదు.