పచ్చి అరటికాయతో ముచ్చటగా మూడు రకాల శ్నాక్స్ మీ కోసం. తినే కొద్దీ తినాలనిపించే ఈ బనానా శ్నాక్స్ తయారుచేసుకోవడం చాలా సింపుల్. అది కూడా తక్కువ ఇంగ్రెడియెంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. రొటీన్ శ్నాక్స్ బదులు కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే వీటిని అస్సలు మిస్ కాకండి...
అరటి కాయ బజ్జీ
కావాల్సినవి :
పచ్చి అరటి కాయ: ఒకటి
శనగపిండి, వేరుశనగలు: ఒక కప్పు
పసుపు, ఉప్పు, నీళ్లు, నూనె: సరిపడా
చాట్ మసాలా, వాము : ఒక్కో టీస్పూన్
కారం: రెండు టీస్పూన్లు
బేకింగ్ సోడా: పావు టీస్పూన్
ఉల్లిగడ్డలు: రెండు
పచ్చిమిర్చి: ఒకటి
కొత్తిమీర: కొంచెం
తయారీ : పాన్లో నూనె వేడి చేసి ఉప్పు, అర టీస్పూన్ వేసి కలిపి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కలపాలి. మరో గిన్నెలో శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, వాము వేసి కలపాలి. తర్వాత బేకింగ్ సోడా వేసి, నీళ్లు పోసి బాగా కలిపి వేయాలి. పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడిచేయాలి. అరటికాయను గుండ్రని ముక్కలుగా కట్ చేసి ముందుగా తయారుచేసుకున్న పిండి మిశ్రమంలో వాటిని ముంచి, తీసి నేరుగా నూనెలో వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. అలా చేసిన వాటన్నింటినీ మధ్యకు కట్ చేసి అందులో వేరుశనగలు, ఉల్లిగడ్డల స్టఫింగ్ పెట్టాలి, అంతే అరటి కాయ బజ్జీ రెడీ.
స్నో బనానా
కావాల్సినవి :
పచ్చి అరటికాయలు : ఆరు
ఉల్లికాడల తరుగు: పావు కప్పు
నీళ్లు : అర కప్పు; చక్కెర : ముప్పావు కప్పు
నూనె, ఉప్పు : సరిపడా
తయారీ : అరటికాయల్ని శుభ్రంగా కడిగి, నిలువుగా కట్ చేసి తొక్క తీయాలి. తర్వాత నూనె వేడి చేసి అందులో వేసి వేగించి పక్కన పెట్టాలి. మరో పాన్లో నీళ్లు పోసి తర్వాత చక్కెర, ఉప్పు వేసి కరిగించాలి. అందులో ఉల్లికాడల తరుగు, అరటికాయలు కూడా వేసి కలపాలి. మిశ్రమం అంతా పొడి పొడిగా అయ్యేవరకు వేగించాలి. దింతో స్నో బనానా రెడీ అయినట్టే.
బనానా టుక్
కావాల్సినవి :
పచ్చి అరటికాయలు : మూడు
నీళ్లు, నూనె, ఉప్పు : సరిపడా
కారం, చాట్ మసాలా : ఒక్కో టీస్పూన్
గరం మసాలా : అర టీస్పూన్
జీలకర్ర పొడి : పావు టీస్పూన్
తయారీ : పాన్లో నీళ్లు పోసి వేడి చేసి అందులో అరటికాయలు వేసి మూతపెట్టి ఉడికించాలి. తర్వాత వాటిని బయటికి తీసి తొక్క తీసి గుండ్రంగా ముక్కలుగా కట్ చేయాలి. వాటిని పప్పుగుత్తితో అదిమి, వేడి నూనెలో వేసి వేగించి పక్కనపెట్టాలి. అందులో కారం, చాట్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపితే టుక్ రెడీ అయిపోతుంది.
►ALSO READ | బాత్రూమ్‌లో ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసా ?
