బాత్రూమ్‌లో ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసా ?

బాత్రూమ్‌లో ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసా ?

గుండెపోటు కేసుల్లో తరచుగా వింటూ ఉండే విషయం ఏంటంటే.. బాత్రూమ్లో హార్ట్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలి పోతే హుటాహుటిన హాస్పిటల్కు తరలించారని చెబుతుంటారు. అసలు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు, ఫ్రెష్ అవుతున్నప్పుడో స్ట్రోక్ ఎందుకొస్తుంటుంది..? ఈ అంశంపై.. జర్నల్ ఆఫ్ ది మెడికల్ అసోసియేషన్ ఆఫ్ కెనడా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ బయటపెట్టింది. మనం స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ముందుగా తల మీద నీళ్లు పోసుకుంటుంటాం.

ఇలా నీళ్లు నెత్తిపై పోసుకోవడం వల్ల జుట్టు నానుతుంది. కానీ.. ఇలా అస్సలు స్నానం చేయకూడదని ఈ అధ్యయనం చెబుతోంది. మీరు మొదట తలపై నీళ్లు పోసుకుంటే.. తలకు ప్రవహించే రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. ధమనులు విడిపోతాయి. ఫలితంగా, స్ట్రోక్ వచ్చి కుప్పకూలి పడిపోతారు. 

ప్రపంచవ్యాప్తంగా వెలువడిన అనేక అధ్యయనాల ప్రకారం.. స్నానం చేసేటప్పుడు స్ట్రోక్ కారణంగా మరణం లేదా పక్షవాతం సంభవించే కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. స్నానం కూడా సరైన విధానంలో చేయాలి. కొన్ని నియమాలను పాటిస్తూ స్నానం చేయకపోతే.. స్నానం చేసేటప్పుడు ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. స్నానం చేసేటప్పుడు ముందుగా.. తలను, జుట్టును తడపకూడదు. ఎందుకంటే మానవ శరీరంలో రక్త ప్రసరణ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతలో ఉంటుంది. మానవ శరీర ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ముందుగా తలపై నీరు పోయడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. ఆ సమయంలో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

►ALSO READ | పాట పాడేటప్పుడు.. అదేనండీ మూత్ర విసర్జన టైంలో.. మంట అనిపిస్తుందా..? ఇది తింటే బిగ్ రిలీఫ్ !

అధిక రక్తపోటు మెదడు ధమనులను చీల్చివేస్తుంది. అందువల్ల.. స్నానం ఎలా చేయాలంటే.. ముందు పాదాలను నీళ్లతో తడుపుకుని.. తరువాత నెమ్మదిగా శరీరంపై నీళ్లు పోసుకోవాలి. చివరగా.. తలపై నీళ్లు పోసుకోవాలి. హై బీపీ, కొలెస్ట్రాల్, మైగ్రేన్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాళ్లు కచ్చితంగా ఇలానే స్నానం చేయాలి. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం అని జర్నల్ ఆఫ్ ది మెడికల్ అసోసియేషన్ ఆఫ్ కెనడా తెలిపింది.