మేడ్చల్: దైవ దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి తిరిగి వచ్చి చూస్తే షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది. ఇంటికి వేసిన తాళాలు విరిగిపడ్డాయి.. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా డోర్లు పగలగొట్టి ఉన్నాయి.. ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.. ఇంట్లో ఉంచిన 6 తులాల బంగారం మాయమైంది. దొంగలు పడ్డారని తెలుసుకున్న ఆ కుటుంబ యజమాని పోలీసులు ఫిర్యాదు చేశారు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడెం నరసయ్యకాలనీలో శనివారం ఆగస్టు 3, 2024 రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. వేములవాడకు దైవదర్శనానికి నరసయ్య కాలనీలో ఓ కుటుంబం శుక్రవారం వెళ్లింది. శనివారం అర్థరాత్రి ఇంటికి వచ్చి చూస్తే.. ఇంటి తాళ పగలగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూస్తే.. వస్తువలన్నీ చిందరవందరగా పడివున్నాయి. బీరువాలో తెరిచి ఉంది.. దీంతో దొంగతన జరిగినట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదుచేశారు. 6 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో తెలిపారు.
కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.