జూబ్లీహిల్స్ , వెలుగు: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే సతీమణి అను శ్రీరెడ్డి నిర్వహిస్తున్న డిజైనర్స్ షోరూమ్‌లో జరిగిన రూ.2.43 లక్షల చోరీ కేసును బంజారా హిల్స్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్పడింది అదే షోరూమ్‌లో పనిచేస్తున్న హౌస్‌కీపింగ్ సిబ్బందేనని పోలీసులు వెల్లడించారు.
ఈ నెల 7న షోరూమ్‌లో డబ్బులు మాయమైనట్లు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, లాకర్ సమీపంలో లభించిన షూ ముద్రలను ఆధారంగా తీసుకొని విచారణ జరిపారు. ఐదు నెలలుగా షోరూమ్‌లో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రం, పురాని బజార్‌కు చెందిన అమీనుల్ హక్ (30)ను విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద రూ. 2 లక్షల 27 వేల 500 రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు.
