గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిన ఇండ్ల నిర్మాణాలు..5 నెలల్లో 4,389 ఇండ్లకు పర్మిషన్లు

గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిన ఇండ్ల నిర్మాణాలు..5 నెలల్లో 4,389 ఇండ్లకు పర్మిషన్లు
  • బల్దియాకు రూ.360.37 కోట్ల అదనపు ఆదాయం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో భారీగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే  ఈసారి పెద్ద సంఖ్యలో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు జారీ చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టుతో పోలిస్తే ఈ సంవత్సరం ఐదు నెలల్లో 4,389 భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి రూ.360.37 కోట్లు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇందులో1008 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఉండగా, ఇన్ స్టంట్ రిజిస్ట్రేషన్ కేటగిరీలో194 బిల్డింగ్స్ కు పర్మిషన్ ఇచ్చారు.

 ఇన్​స్టంట్ అప్రూవల్ కేటగిరీ కింద 3,240 బిల్డింగ్స్ కు అనుమతులిచ్చి,161 ఓసీలు జారీ చేశారు. సింగిల్ విండో కేటగిరీ కింద 95 బిల్డింగ్స్​కు అనుమతులివ్వగా, 847 ఓసీలు ఇష్యూ చేశారు. వీటి ద్వారా ఈ ఐదు నెలల్లో రూ.759.98 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయంలో చూస్తే  కేవలం రూ.399.61 కోట్లు మాత్రమే వచ్చింది.  గతేడాది మొత్తం టౌన్ ప్లానింగ్ విభాగానికి రూ.1,134.24 కోట్లు వచ్చింది. ఈ ఏడాది రూ.2 వేలకోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.