హౌతి అటాక్: బ్రిటీష్ చమురు నౌకకు మద్దతుగా నిలిచిన భారత నావికాదళం

హౌతి అటాక్: బ్రిటీష్ చమురు నౌకకు మద్దతుగా నిలిచిన భారత నావికాదళం

యెమెన్లో బ్రిటీష్ చమురు ట్యాంకర్ MV మెర్లిన్ లువాండాపై ఇరాన్ హౌతీ తిరుగుదారులు దాడి చేశారు. హౌతీలు ప్రయోగించిన క్షపణీ దాడిలో  దెబ్బతిన్నది. జనవరి 26 రాత్రి MV మార్లిన్ లువాండా నుంచి వచ్చిన విపత్తు కాల్ కు ప్రతిస్పందనగా గల్ఫ్ ఆఫ్ అడెన్ లో తమ గైడెడ్ మిస్సైల్  డిస్ట్రాయర్ INS విశాఖపట్నం ను మోహరించినట్లు భారత నావికా దళం శనివారం (జనవరి 27) తెలిపింది. ప్రమాదంలో ఉన్న మర్చంట్ ఆఫ్ వెస్సెల్స్ అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేసేందుకు INS విశాఖపట్నం మోహరించారు. ఇప్పటికే MVలో 22 భాతరీయులు, ఒక బంగ్లాదేశ్ సిబ్బంది ఉన్నారని భారత నావికా దళం తెలిపింది. 

జనవరి 26 సాయంత్రం 7.45 గంటల సమయంలో ఇరాన్ మద్దతు గల హౌతి ఉగ్రవాదలు యెమెన్ లోని హౌతి నియంత్రిత  ప్రాంతాలనుంచి యాంటీ షిప్ బాలికస్టక్ క్షిపణిని ప్రయోగించారు. మార్సల్ దీవుల జెండాతో కూడిన చమురు ట్యాంకర్ MV మార్లిన్ లువాండాపై దాడి చేసినట్టు తెలుస్తోంది. 

ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలతో సహా ఈ ప్రాంతంలోని వ్యాపార నౌకలపై డ్రోన్, పైరేట్ల దాడుల సంఘటన ఇటీవలి కాలంలోఇదే మొదటిది. భారత నౌకాదళం సమస్యాత్మక  ప్రాంతంలో నిఘా ను పెంచింది. భారత దేశానికి వచ్చే వాణిజ్య నౌకలపై ఇటీవలీ దాడుల క్రమంలో దాదాపు 10 యుద్ధ నౌకలతో కూడి టాస్క్ గ్రూపులను మోహరించింది భారత నావికాదళం. 

MVలను రక్షించడం, సముద్రంలో భద్రత నిర్ధారణ, పెంపులో దృఢ సంకల్పంతో భారత నావికా దళం కట్టుబడి ఉందని నేవీ అధికారులు చెప్పారు.