భారీ లాభం: ‘మాస్టర్’ నిర్మాతకు అదనంగా కోట్లు చెల్లించిన అమెజాన్

భారీ లాభం: ‘మాస్టర్’ నిర్మాతకు అదనంగా కోట్లు చెల్లించిన అమెజాన్

చెన్నై: తమిళ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి కలసి నటించిన సినిమా మాస్టర్. పొంగల్ కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ మంచి హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైచిలుకు కలెక్షన్స్ సాధించి విజయ్ కెరీర్‌‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఈ ఫిల్మ్‌‌తో తమిళనాట సూపర్ హిట్ కొట్టిన విజయ్.. తెలుగు ఆడియన్స్‌ను కూడా మరోమారు ఆకట్టుకున్నాడు.

ఈ మూవీని రీసెంట్‌‌గా అమెజాన్ ప్రైమ్‌‌లో మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమా విడుదలై రెండు వారాలకే అయినప్పటికీ ఓటీటీలో రిలీజ్ చేయాలని మాస్టర్ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ డెసిజన్ మూవీ మేకర్స్‌‌కు కాసుల వర్షం కురిపించింది. సినిమా మంచి హిట్ సాధించడంతో మూవీ మేకర్స్‌ అమెజాన్ ప్రైమ్ అదనపు మొత్తాన్ని ముట్టజెప్పింది. తొలుత మాస్టర్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ.36 కోట్లు చెల్లించిన అమెజాన్.. ముందుగానే ఓటీటీలో విడుదల చేస్తున్నందుకు గాను అదనంగా మరో రూ.15.5 కోట్లు పే చేసింది. మొత్తంగా ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారానే మాస్టర్ నిర్మాతకు రూ.51.5 కోట్లు లాభం దక్కడం విశేషం. ఈ సినిమాను ఎక్స్‌‌బీ క్రియేషన్స్ పతాకంపై జేవియర్ బ్రిట్టో నిర్మించారు.