అహ్మదాబాద్‌లో IPL ఫైనల్.. టికెట్లు బుక్ చేసుకునే స్మార్ట్ గైడ్‌లైన్స్ ఇవే!

అహ్మదాబాద్‌లో IPL ఫైనల్.. టికెట్లు బుక్ చేసుకునే స్మార్ట్ గైడ్‌లైన్స్ ఇవే!

IPL 2026 Final: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఐపీఎల్ 2026 క్లైమాక్స్ పీక్స్ కి చేరుకుంది. లీగ్ స్టేజ్ ముగిసి.. ప్లే-ఆఫ్స్ మ్యాచ్‌లు నరాలు తెగే ఉత్కంఠను రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి పెద్ద జట్లు ముందే ప్యాకప్ చెప్పేసినా, ఐపీఎల్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మే 31న (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ గ్రాండ్ ఫైనల్ జరగనుంది. కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే ఫైనల్ చేరడంతో పాటు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఈ క్రేజీ మ్యాచ్‌ల టికెట్ల కోసం బీసీసీఐ (BCCI) అధికారిక భాగస్వామిగా District by Zomato యాప్‌ను ప్రకటించింది.
 
ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్:
* మే 26 (మంగళవారం): క్వాలిఫైయర్ 1 (RCB వర్సెస్ GT) – ధర్మశాల (RCB గెలిచి ఫైనల్‌కు వెళ్లింది)
* మే 27 (బుధవారం): ఎలిమినేటర్ (SRH వర్సెస్ RR) – న్యూ చండీగఢ్ (రాజస్థాన్ గెలిచి క్వాలిఫైయర్ 2లో గుజరాత్ తో తలపడనుంది )
* మే 29 (శుక్రవారం): క్వాలిఫైయర్ 2 (గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ) – న్యూ చండీగఢ్
* మే 31 (ఆదివారం): గ్రాండ్ ఫైనల్ (RCB వర్సెస్ క్వాలిఫైయర్ 2 విన్నర్ ) – అహ్మదాబాద్.

టికెట్ల అమ్మకాలు ఎప్పుడు స్టార్ట్ అంటే?: 
ఈసారి బీసీసీఐ టికెట్ల అమ్మకాలను విడతల వారీగా రిలీజ్ చేస్తుంది. రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మే 20, మే 22 తేదీల్లో ప్రత్యేక విండోల ద్వారా ముందే టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇక సాధారణ ఫ్యాన్స్ విషయానికొస్తే.. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ టికెట్లు మే 21 నుంచి.. క్వాలిఫైయర్ 2, గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు మే 23 రాత్రి 8:00 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. మ్యాచ్ తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.

ఫైనల్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?: 
బ్లాక్ టికెట్లు, నకిలీ టికెట్లు కొనుగోలు చేసి ఇబ్బంది పడుకుండా ఉండేందుకు బీసీసీఐ సూచించిన అధికారిక ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించింది. కింద పేర్కొన్న స్మార్ట్ స్టెప్స్ ఫాలో అయి మీరు ఈజీగా టికెట్ బుక్ చేసుకోవచ్చు..

* స్టెప్ 1: ఫస్ట్ మీ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి District by Zomato యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ (iplt20.com)ని ఓపెన్ చేయాలి.. 

* స్టెప్ 2: యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్‌పై కనిపించే Sports లేదా IPL Playoffs అనే ప్రత్యేక బ్యానర్‌పై క్లిక్ చేయాలి..  

* స్టెప్ 3: అక్కడ మీకు కావాల్సిన మ్యాచ్‌ను (ఉదాహరణకు: మే 31న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్) ఎంపిక చేసుకోవాలి.. 

* స్టెప్ 4: అనంతరం స్టేడియం ఇంటరాక్టివ్ మ్యాప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ బడ్జెట్‌కు తగిన సీటింగ్ కేటగిరీని సెలక్ట్ చేసుకుని, మీకు నచ్చిన సీట్లను పీక్ చేసుకోండి.

* స్టెప్ 5: చివరగా మీ యూపీఐ (UPI), క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ కంప్లీట్ చేయండి.. టికెట్లు డిజిటల్ రూపంలో (M-Tickets) మీ ప్రొఫైల్‌కు యాడ్ అవుతాయి.