23 రోజుల బాబుకు ట్రీట్‌‌మెంట్ ఎట్ల?

23 రోజుల బాబుకు ట్రీట్‌‌మెంట్ ఎట్ల?

23 రోజుల పసికందుకు కరోనా

మర్కజ్ వెళ్లొచ్చిన తాత నుంచి బాబు తండ్రికి.. తండ్రి నుంచి బాబుకు వైరస్​

రాష్ట్రంలో కొత్తగా 40 మందికి పాజిటివ్​

మొత్తం 404 కు చేరిన బాధితుల సంఖ్య

నిజామాబాద్‌‌లో 37, హైదరాబాద్​లో 178 కి చేరిన కేసులు

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా మహమ్మారి పసిబిడ్డలనూ వదలడం లేదు. మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లాలో 23 రోజుల బాబుకు వైరస్ సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడ్డవారిలో ఈ బాబే అత్యంత పిన్న వయస్కుడు. ఈ పసికందుకు తండ్రి నుంచి వైరస్ సోకిందని ఆఫీసర్లు వెల్లడించారు. బాబు వాళ్ల తాత ఇటీవల ఢిల్లీ మర్కజ్​లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు వెళ్లొచ్చాడు. ఆయనకు వైరస్ ఉన్నట్టు ఇదివరకే డాక్టర్లు గుర్తించారు. అతడు గాంధీ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నాడు. మంగళవారం అతడి కుటుంబసభ్యులకు టెస్టులు చేయించారు. ఈ టెస్టుల్లో 23 రోజుల బాబుతోపాటు బాబు తండ్రికి వైరస్ ఉన్నట్టు తేలిందని జిల్లా కలెక్టర్‌‌‌‌ ఎస్‌‌.వెంకటరావు ప్రకటించారు. అయితే తాత నుంచి నేరుగా కాకుండా.. తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి బాబుకు వైరస్ సోకినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో మంగళవారం మరో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 404కు చేరింది. ఇందులో 45 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా, పదకొండు మంది మరణించారు. 348 మంది వివిధ దవాఖాన్లలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు.

కొత్తగా నిజామాబాద్‌లో 10.. హైదరాబాద్‌లో 17

మంగళవారం వెల్లడైన 40 పాజిటివ్​ కేసుల్లో 10 కేసులు నిజామాబాద్​ జిల్లాలోనే ఉన్నాయి. దీంతో  జిల్లాలో మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య  37కు చేరుకుంది.  హైదరాబాద్‌ తర్వాత ఎక్కువగా నిజామాబాద్‌ నుంచే 80 మంది ఢిల్లీ మర్కజ్​లో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడీ జిల్లా నుంచి ఎక్కువ కేసులు నమోదవడానికి మర్కజ్​ లింకే కారణమని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం మరో 17 కేసులు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్​లో మొత్తం కేసులు సంఖ్య 178కి చేరింది. ఇందులో 21 మంది హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. ఏడుగురు మరణించారు. మరో 150 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా గద్వాల్‌లో 9 మందికి, మహబూబ్‌నగర్‌‌లో ముగ్గురికి, అదిలాబాద్‌ ఒకరికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే, ఆయా జిల్లా అధికారుల ప్రకటనలకు, వైద్యారోగ్యశాఖ బులెటిన్లకు పొంతన కుదరడం లేదు. ఖమ్మంలో ఓ వ్యక్తికి వైరస్ వచ్చినట్టు సోమవారమే అక్కడి అధికారులు ప్రకటించగా.. మంగళవారం నాటి బులెటిన్‌లో ఆ విషయం పేర్కొనలేదు.

ఇంకో 900 శాంపిళ్లు

రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ మర్కజ్ లింక్ ఉన్నవే. మర్కజ్ వెళ్లొచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులందరినీ వైద్యారోగ్యశాఖ క్వారంటైన్‌ చేస్తోంది. వీళ్లకు సంబంధించిన 900 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌ మంగళవారం సాయంత్రం పేర్కొన్నారు.

ఆ బాబుకు ట్రీట్‌‌మెంట్ ఎట్ల?

రాష్ట్రంలో ఇప్పటివరకూ పది మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. ఇందులో మహబూబ్‌‌నగర్‌‌‌‌కు చెందిన 23 రోజుల బాబు అత్యంత పిన్న వయస్కుడు. ఇంత చిన్నబాబుకు ట్రీట్‌‌మెంట్ ఎట్ల ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిల్లల విషయంలో సింప్టమ్స్‌‌ను బట్టి ట్రీట్‌‌మెంట్ ఇవ్వనున్నట్టు గాంధీ హాస్పిటల్​ డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు ఇస్తున్న ట్యాబ్లెట్లు అన్నీ సిరప్ రూపంలో అందుబాటులో ఉన్నాయని వారు అన్నారు. అవసరాన్ని బట్టి పిల్లలకు ఆ సిరప్స్​ ఇస్తామని చెప్పారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 404కు చేరింది. ఇందులో 45 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా, పదకొండు మంది మరణించారు. 348 మంది వివిధ దవాఖాన్లలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు.

For More News..

ఈ నెల కొత్త కరెంట్ బిల్లు రాదు

వారికి కూడా 50 లక్షల కరోనా ఇన్సూరెన్స్

కరోనా టెస్ట్ ఎట్ల చేస్తరో తెలుసా?

లాక్‌డౌన్ కంటిన్యూ?