మీకు తెలుసా : మీ PF అకౌంట్ కు ఆధార్ లింక్ ఇలా చేసుకోవాలి..

మీకు తెలుసా : మీ PF అకౌంట్ కు ఆధార్ లింక్ ఇలా చేసుకోవాలి..

ఈపీఎస్ కు మీ ఆధార్ కార్డును లింక్ చేశారా? ఈపీఎఫ్ ఖాతా నెంబర్ (UAN) కు ఆధార్ కార్డు లింక్ చేయడం అనేది ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఒకవేళ మీరు గనక ఈ ఆధార్ ను ఈపీఎఫ్ తో లింక్ చేయకపోతే ఇప్పుడు చేయండి.. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 లోని సెక్షన్ 142 ప్రకారం..అసంఘటిత రంగంలోని కార్మికులందరూ ఆధార్ కార్డును ఈపీఎఫ్ కు లింక్ చేయడం తప్పనిసరి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా మీ ఆధార్ కార్డును ఈపీఎఫ్ అకౌంట్ కు లింక్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం.. 

ఆన్ లైన్ ద్వారా ఈపీఎఫ్ అకౌంట్ కు ఆధార్ లింక్..

  • ముందుగా EPFO అధికారిక వెబ్ సైట్ ​​https://www.epfindia.gov.in/ను ఓపెన్ చేయాలి. 
  • UAN నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ అకౌంట్ లోకి లాగిన్ కావాలి. 
  • డ్రాప్ డౌన్ మెనూ నుంచి KYC ని సెలక్ట్ చేసుకొని Manage లోకి వెళ్లాలి. 
  • డాక్యుమెంట్ రకంలో Aadhaar ఆప్షన్ ను ఎంచుకొనిమీ ఆధార్ నంబరును ఎంటర్ చేయాలి.  
  • వివరాలను సమర్పించేందుకు SAVE బటన్ ను క్లిక్ చేయాలి. 
  • మీ ఆధార్ కార్డు వివరాలు EPFO  ద్వారా ధృవీకరంచిన తర్వాత UAN కు లింక్ చేయబడుతుంది. 

EPF కు ఆధార్ కార్డు లింక్ అయినట్లయితే.. EPFO వెబ్ సైట్ లోని మీ EPF ప్రొఫైల్ లో ఆధార్ ఆప్షన్ పక్కన Verified  అనే పదం కనిపిస్తుంది. దీంతో  పాటు మీ రిజిస్టర్ మొబైల్ నంబరుకు receive అని మేసేజ్ వస్తుంది. +