
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మంగళవారం ( నవంబర్ 21) నుంచి ఇంటింటికి పోలింగ్ ప్రారంభమైంది. తొలి ఓటును ఖైరతాబాద్ కు చెందిన 91 యేళ్ల వృద్ధురాలు వినియోగించుకుంది. తెలంగాణలో ఈ సౌకర్యం కల్పించడం ఇదే మొదటి సారి.. ఇంతకుముందు కర్ణాటక ఎన్నికల్లో ఈ సౌకర్యం కల్పించారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల( పీడబ్ల్యూడీ)ల ఇండ్లకు పోలింగ్ సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అర్హులైన ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటును వేయిస్తారు. ఈ సదుపాయం పోస్టల్ బ్యాలెట్ మాదిరిగా నే ఉంటుంది. ముందుగానే ఓటు నమోదు చేసుకోవాలి. గోప్యతను నిర్ధారించేందుకు అర్హులైన ఓటర్లు ఇండ్లలో ఓటింగ్ కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేస్తారు.
ఈ ఓట్లను ఎలా భద్రపరుస్తారు.. లెక్కిస్తారు?
అర్హులైన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకునే సేవలో భాగంగా అర్హులైన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల( పీడబ్ల్యూడీ)ల ఇండ్లకు పోలింగ్ సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అర్హులైన ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటును వేయిస్తారు. ఈ సదుపాయం పోస్టల్ బ్యాలెట్ మాదిరిగా నే ఉంటుంది. ముందుగానే ఓటు నమోదు చేసుకోవాలి. గోప్యతను నిర్ధారించేందుకు అర్హులైన ఓటర్లు ఇండ్లలో ఓటింగ్ కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేస్తారు. ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా వీడియో గ్రఫీ ద్వారా రికార్డ్ చేయబడుతుంది. ఫుటేజ్ RO కి సమర్పిస్తారు. తెలంగాణలో నవంబర్ 30న అసలు పోలింగ్ నిర్వహించిన తర్వాత ఈ ఓట్లను కలిపి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయి.
మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 21 నుంచి కనీసం నవంబర్ 27 వరకు ఇంటింటికి ఓటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఈ సౌకర్యం కల్పించడం ఇదే తొలిసారి.