సోమాజిగూడ HP బంకులో పెట్రొల్ కొట్టించారా..? అయితే మెకానిక్ దగ్గరికి వెళ్ళక తప్పదు..!

సోమాజిగూడ HP బంకులో పెట్రొల్ కొట్టించారా..? అయితే మెకానిక్ దగ్గరికి వెళ్ళక తప్పదు..!

హైదరాబాద్ లోని బిజీ ఏరియాల్లో సోమాజిగూడ ఒకటి.. షాపింగ్ కాంప్లెక్సులు, గవర్నమేంట్ ఆఫీసులు, కార్పొరేట్ ఆఫీసులు ఎక్కువగా ఉన్న ఏరియా కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది సోమాజిగూడ.అలాంటి ఏరియాలో ఉన్న హెచ్ పీ పెట్రోల్ బ్యాంకుకు వాహనదారులు క్యూ కట్టారు. పెట్రోల్ బంక్ అన్నాక వాహనదారులు క్యూ కట్టడం మాములే కదా.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా... ?వాహనదారులు క్యూ కట్టింది పెట్రోల్ కొట్టించేందుకు కాదు. ఆ బంకులో పెట్రోల్ కొట్టించడం వల్ల బండ్లు మొరాయించడంతో క్యూ కట్టారు వాహనదారులు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

సోమాజిగూడలోని హెచ్ పీ పెట్రోల్ పంప్ ఔట్లెట్ లో పెట్రోల్ లో నీళ్లు కలవడం కలకలం రేపింది.పెట్రోల్ పోయించుకున్న వాహనదారుల వాహనాలు మొరాయించడంతో పెట్రోల్ బంకు కు క్యూ కడుతున్నారు వాహనదారులు. ఈ అవుట్లెట్లో శుక్రవారం పెట్రోల్ పోయించుకున్న వాహనదారులు వాహనాలు ముందుకు కదలకుండా మొరాయించడంతో పెట్రోల్ బంకు కు క్యూ కడుతున్నారు. ఈ విషయమై వాహనదారులు పెట్రో ల్ బంక్ యాజమాన్యాన్ని ప్రశ్నిద్దాం అనుకుంటే ఆ బంక్ అవుట్లెట్ కావడంతో పై స్థాయిలో ఎవరు అందుబాటులో లేకపోవడంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో మాట్లాడించడం మీద పెదవి విరుస్తున్నారు వాహనదారులు. పెట్రోల్ బంక్ లో ఉన్న మేనేజర్ స్థాయి వ్యక్తితో మాట్లాడగా వాహనాలకు కావలసిన సర్వీసింగ్ మాత్రమే తాము ఇవ్వగలమని..  భవిష్యత్తులో వాహనాలలోని ఇంజన్లు మొరాయిస్తే దానికి తమ బాధ్యత ఉండదని సమాధానం చెప్పారు.. ఈ క్రమంలో అసంతృప్తికి గురైన వాహనదారులు అసహనంతో వెనుదిరుగుతున్నారు.

పెట్రోల్ లోకి నీళ్లు ఎలా వచ్చాయని అడగగా... తీవ్ర వర్షపాతంతో పెట్రోలు ట్యాంకులలోకి నీరు చేరాయని సమాధానం ఇస్తున్నారు సిబ్బంది. సిబ్బంది సమాధానంతో సంతృప్తి చెందని వాహనదారులు దీనిపై చట్టపరమైన చర్యలకు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.