చేవెళ్ల బస్సు ప్రమాదంపై సుమోటోగా HRC కేసు

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సుమోటోగా HRC కేసు

హైదరాబాద్: 19 మంది ప్రాణాలు కోల్పోయిన చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసకుంది. చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ( HRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. వివిధ వార్త పత్రికల్లో వచ్చిన వార్త కథనాల ఆధారంగా హెచ్ఆర్సీ సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది.

 ఈ సంఘటనపై 2025, డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక అందజేయాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ, రోడ్లు రవాణా, భవనాల శాఖ, హోంశాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ,  నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్‎కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంపై స్టేట్ హ్యుమన్ రైట్స్ కమిషన్ చెర్మెన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ వ్యక్తం చేశారు.

కాగా, వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు దగ్గర సోమవారం (నవంబర్ 3) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాంగ్ రూట్లో అతి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఇద్దరూ మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు టిప్పర్ అతి వేగమే కారణమని.. బస్సు డ్రైవర్ తప్పేం లేదని ఆర్టీసీ వివరణ ఇచ్చింది.