ధరణి లోపాల వల్ల కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు

ధరణి లోపాల వల్ల కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లోని లోపాలు, తప్పుల కారణంగా పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీటిపై సీబీఐ దర్యాప్తు  చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ)కి ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ అవకతవకలు జరిగాయని, అందుకే రెవెన్యూ మంత్రిగా సీఎం కేసీఆర్, సీసీఎల్ఏగా సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జడ్సన్ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్.. ధరణిపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌‌ కుమార్ కు బుధవారం నోటీసులు జారీ చేసింది.