స్టూడెంట్లకు అకడమిక్ ఆల్టర్నేటివ్ క్యాలెండర్

స్టూడెంట్లకు అకడమిక్ ఆల్టర్నేటివ్ క్యాలెండర్
  • 11,12 తరగతులకు విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్టు కారణంగా స్టూడెంట్లకు ఇంటిదగ్గరే క్లాసులను బోధించేలా కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఈఆర్‌టీ సహకారంతో ఆల్టర్నేటివ్ క్యాలెండర్‌ను రూపొందించింది. హెచ్చార్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ బుధవారం 11, 12 తరగతులకు ప్రత్యామ్నాయ విద్యా కేలెండర్ ను బుధవారం విడుదల చేశారు. దీని ద్వారా స్టూడెంట్లు ఇంటివద్దే ఆన్ లైన్ లో క్లాసులు వినవచ్చని ట్వీట్ చేశారు. దివ్యాంగులు కూడా చదువుకోవడానికి వీలుగా దీనిని రూపొందించామని, ఆడియో బుక్స్, రేడియో ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. మొబైల్, రేడియో, టెలివిజన్, ఎస్ఎంఎస్. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఎన్‌సిఇఆర్‌టి ఇంతకుముందే మిగతా తరగతుల కోసం ఆల్టర్నేటివ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.ఈ క్యాలెండర్‌ను డీటీహెచ్ చానళ్ళ ద్వారా ప్రసారం చేస్తారు. ఎస్‌సీఈఆర్‌టీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, సీబీఎస్ఈ, స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులతో వీడియో కాన్ఫరెన్స్ లో క్లాసులు నిర్వహిస్తారు.