ప్రభాస్​ కోసం అతిథిగా హృతిక్​

ప్రభాస్​ కోసం అతిథిగా హృతిక్​

ప్రభాస్‌‌ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నా అందులో దేనికదే డిఫరెంట్ జానర్ మూవీ. ‘ఆదిపురుష్’ మైథాలజీ కాగా, ‘సాలార్‌‌‌‌’ పీరియాడిక్ మూవీ. సైన్స్‌‌ ఫిక్షన్ జానర్‌‌‌‌లో ‘ప్రాజెక్ట్ కె’ రూపొందుతుంటే, హారర్ కంటెంట్‌‌తో ‘రాజా డీలక్స్‌‌’ తెరకెక్కుతోంది. ఆ తర్వాత నటించబోయే ‘స్పిరిట్‌‌’ ఓ పోలీస్ ఆఫీసర్‌‌‌‌ కథ. ఇవన్నీ పూర్తయ్యాక ‘వార్‌‌‌‌’ ఫేమ్ సిద్ధార్థ్‌‌ ఆనంద్‌‌ డైరెక్షన్‌‌లో ఓ పూర్తి స్థాయి యాక్షన్‌‌ మూవీలో నటించబోతున్నాడు ప్రభాస్. మైత్రి మూవీ మేకర్స్‌‌ సంస్థ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్‌‌ మూవీలో ప్రభాస్‌‌తో పాటు మరో యాక్షన్ హీరో నటించబోతున్నాడట. ఆ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్.

అయితే అతనిది ఫుల్‌‌ లెంగ్త్ క్యారెక్టర్ కాదట.. కేవలం కొద్ది నిముషాల అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై ఇప్పటికే హృతిక్‌‌ని ఒప్పించాడట సిద్ధార్థ్. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలకు ఈ ఇద్దరూ కలిసి వర్క్ చేశారు. హృతిక్ నెక్స్ట్ మూవీ ‘ఫైటర్‌‌‌‌’కి కూడా అతనే డైరెక్టర్. ప్రభాస్‌‌ సినిమాలో హృతిక్‌‌ నటించడానికి, డైరెక్టర్‌‌‌‌తో ఉన్న  ఫ్రెండ్‌‌ షిప్‌‌ ఓ కారణమైతే.. ప్రభాస్‌‌తో కలిసి నటించాలనే ఆసక్తి మరో కారణమని టాక్. ఇదిలా ఉంటే ప్రభాస్‌‌తో ప్రశాంత్‌‌ నీల్‌‌ తీస్తున్న ‘సాలార్‌‌‌‌’ చిత్రంలో యశ్‌‌ గెస్ట్ రోల్‌‌లో కనిపించబోతున్నాడని కూడా వినిపిస్తోంది. మొత్తానికి యాక్షన్‌‌ కాంబినేషన్స్‌‌తో డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు ప్రభాస్.