War 2 : జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ .. వార్-2 షూటింగ్ పూర్తి

War 2 : జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ .. వార్-2 షూటింగ్ పూర్తి

హృతిక్ రోషన్, ఎన్టీఆర్  హీరోలుగా నటిస్తున్న  మోస్ట్‌‌‌‌ అవెయిటింగ్‌‌‌‌ స్పై యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ‘వార్‌‌‌‌‌‌‌‌ 2’.  ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్‌‌‌‌ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. కియారా అద్వానీ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఆగస్టు 14న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా  ఈ చిత్రం విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సెట్‌‌‌‌లో టీమ్ అంతా కలిసి కేక్ కట్ చేసిన ఫొటోను హృతిక్ రోషన్ షేర్ చేస్తూ ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ‘‘వార్ 2 చిత్రం కోసం 149 రోజులు కష్టపడ్డాం. 

ఈ మూవీ సెట్‌‌‌‌లో రోలింగ్ కెమెరా అనే మాట ఆగిపోవడం పట్ల మిక్సుడ్‌‌‌‌ ఎమోషన్స్‌‌‌‌ ఫీల్ అవుతున్నా. చేజింగ్ సీన్స్, యాక్షన్, డ్యాన్స్, రక్తం, చెమటలతో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాం. ఎన్టీఆర్ సర్‌‌‌‌‌‌‌‌తో కలిసి వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నా. కియారా అద్వానీతో  స్ర్కీన్‌‌‌‌ షేర్ చేసుకోవడం ఎక్సయిటింగ్‌‌‌‌గా అనిపించింది. ప్రేక్షకులకు  గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ ఇచ్చేలా అయాన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు’ అని పోస్ట్ చేశాడు.