
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈనెల 24న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా హ్రితిక మాట్లాడుతూ ‘సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పట్నుంచీ సినిమాలపై ఆసక్తి ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా రెండు సినిమాల్లో కూడా నటించాను. ‘అల్లంత దూరాన’ తర్వాత హీరోయిన్‌గా నటించిన రెండో చిత్రమిది.
సంజయ్ గారు కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఇదొక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉంది. ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించా. సిరి చాలా తెలివైన అమ్మాయి. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తాను. అమాయకులైన తండ్రి కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ పాయింట్‌నే చాలా ఫన్నీగా చూపించారు. సన్నీ చాలా జెన్యూన్‌గా, ఓపెన్‌గా ఉంటారు.
సెట్‌లో నాకు చాలా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ సంజయ్ రైటింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. హీరోయిన్‌గా ప్రయోగాత్మక సినిమాలు చేయాలని ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ఆమె చేసే రోల్స్ లాంటివి చేయాలని ఉంటుంది. హీరోల విషయంలో నాని అంటే నాకిష్టం’ అని చెప్పింది.