శంషాబాద్‪లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ.11కోట్ల విలువైన గంజాయి

శంషాబాద్‪లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ.11కోట్ల విలువైన గంజాయి

హైదరాబాద్ శివారులో SOT పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పీఎస్ లిమిట్స్ లో గంజాయి పట్టుబడింది. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేశారు SOT పోలీసులు. సంగిగూడ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు... ఓ కంటైనర్ లో భారీగా గంజాయిని గుర్తించారు. కంటైనర్ తో పాటు ఓ వ్యక్తిని సైబరాబాద్ కమిషనర్ ఆఫీసర్ కు తరలించారు.  ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.