ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. ప్రజాభవన్ ముందు భారీ క్యూలైన్

ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. ప్రజాభవన్ ముందు భారీ క్యూలైన్

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు. ప్రతివారం మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.

ఈరోజు(జనవరి 19) ఉదయం 5 గంటల నుంచే మహ్మాతా జ్యోతిబాపులే ప్రజాభవన్ దగ్గర ఆర్జీలతో ప్రజలు క్యూలు కట్టారు. జనాలు అధికంగా రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 

నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. దీంతో ఏ సమస్య ఉన్నా నేరుగా హైదరాబాద్‎కు వస్తుండటంతో ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణికి జనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం, షుగర్ ఫ్యాక్టరీ పున ప్రారంభం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, 317 ఇబ్బందులు వంటి అంశాలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు సమాచారం.