ఏఐ కోర్సులకు భారీ డిమాండ్.. 90 శాతం పెరిగిన అడ్మిషన్లు

ఏఐ కోర్సులకు భారీ డిమాండ్.. 90 శాతం పెరిగిన అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్)లో నైపుణ్యాలను పెంచే కోర్సులకు డిమాండ్​ బాగుందని ఎడ్యుటెక్ ప్లాట్ ఫారమ్  టైమ్స్ ప్రో నివేదిక​ వెల్లడించింది. దీని ప్రకారం, టెక్నాలజీ, అనలిటిక్స్ కోర్సుల్లో ప్రవేశాలు 90 శాతం పెరిగాయి.  

మొత్తం దరఖాస్తుల్లో 75 శాతం ఏఐ కోర్సులవే ఉన్నాయి!  చిన్న నగరాల నుంచి వచ్చిన దరఖాస్తులు 33 శాతం పెరిగాయి.  2027 నాటికి దేశీయ ఏఐ మార్కెట్ 17 నుంచి 22 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది.

జాబ్​ మార్కెట్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా టెకీలు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఐఐటీలతో, ఐఐఎంలతో కలిసి  కోర్సులు అందిస్తున్నామని టైమ్స్ ప్రో తెలిపింది.