పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పెద్దమ్మతల్లి  ఆలయానికి పోటెత్తిన భక్తులు

దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాలా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. 

ఇవాళ ఉదయం నుండి ఇప్పటి వరకు 50 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు.   అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు అమ్మవారి ఆలయం తెరిచే ఉండనుంది.