- మున్సిపాలిటీకిరూ.18.70 కోట్ల ఫండ్స్
- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెల్లడి
షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ నియోజకవర్గంలో రోడ్లు, మున్సిపాలిటీ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. మంగళవారం తన క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. షాద్ నగర్ మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.18.75 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ ఫండ్స్‌తో 35 రకాల పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
పార్కులపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామాలను అనుసంధానం చేస్తూ రూ.105 కోట్ల నిధులతో 140 కిలోమీటర్ల రహదారులు నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీనికోసం టెండర్లు కూడా వేశామన్నారు. త్వరలో హెచ్ఎండీఏ నిధులు కూడా వస్తాయన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, అగ్గనూర్ బస్వం, రఘునాయక్ తదితరులు పాల్గొన్నారు.
