
మరో రెండు రోజుల్లో హైదరాబాద్ లోని ప్రతీ గల్లీలో గణనాథుడు కొలువు కానున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వినాయక విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు నిర్వాహకులు. రోడ్లపైన భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్ని చోట్ల వినాయక విగ్రహాలను తీసుకెళ్తుండగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇవాళ ( ఆగస్టు 25) వినాయక చవితిరోజున ప్రతిష్ఠించేందుకు కొందరు వాహనంపై తీసుకెళ్లున్న భారీ వినాయక విగ్రహం హిమాయత్నగర్ స్ట్రీట్ నంబర్ 5లో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. దాంతో పలు బైక్లు ధ్వంసమయ్యాయి. ఎవరి ఎలాంటి గాయాలు కాకపోయినా వాహనదారులకు ఇబ్బంది కలిగింది. దాంతో జీహెచ్ ఎంసీ సిబ్బంది క్రేన్ సాయంతో విగ్రహాన్ని తొలగించారు. పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.