
ఇంఫాల్: మణిపూర్ లో మహిళలను నగ్నంగా తిప్పిన ఘటనపై ఆ రాష్ట్రంలోని చురాచాంద్‌పూర్ జిల్లాలో గురువారం వేలాది మంది రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. అందరూ నల్ల దుస్తులు వేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలంటూ స్లోగన్స్ చేశారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలంటూ భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.