హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఆర్‌ఎస్‌ఎస్, గురుద్వారాస్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం జలవిహార్లో గురుతేజ్ బహదూర్ 350వ షహీదీ సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సాగే ఈ కార్యక్రమంలో గురుతేజ్ బహదూర్ త్యాగాల స్మృతి, సిక్కు చరిత్ర, బలిదానాలు, హెరిటేజ్‌పై ప్రత్యేక ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు.
సెంట్రల్ కమిటీ ఆఫ్ గురుద్వారా సాహెబ్ చైర్మన్ సర్దార్ గురుచరణ్ సింగ్ బగ్గా నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ హరిప్రీత్ సింగ్, ప్రొఫెసర్ డా. అస్సా సింగ్ గుమాన్, జగ్వీర్ సింగ్ ఖల్సా ఉపన్యాసాలు
ఇవ్వనున్నారు.

