
సికింద్రాబాద్, వెలుగు: చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తులకు మరింత ఆదరణ కలిగించేందుకు సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో ఈ నెల 13న ప్రారంభమైన ‘హునార్ మహోత్సవ్’ సందర్శకులను ఆకట్టుకుంటున్నది. పలు రాష్ట్రాల నుంచి 300 మంది కళాకారులు స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అప్లిక్ వర్క్, డ్రై ఫ్లవర్స్, జూట్-కేన్, ఇత్తడి ఉత్పత్తులు, చెక్క, మట్టి బొమ్మలు, అజ్రఖ్ బ్లాక్ ప్రింట్, బ్లూ ఆర్ట్ కుండలు, పష్మీనా షాల్, ఖాదీ ఉత్పత్తులు, బనారస్ సిల్క్, చందేరీ సిల్క్, రాజస్థానీ ఆభరణాలతో మరెన్నో ఉత్పత్తులు ఈ స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. హునార్ మహోత్సవ్‌లోని ఫుడ్ కోర్టులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను అందిస్తున్నట్లు చెప్పారు.