హరికేన్ డోరియన్ ధాటికి శుక్రవారం నాటికి బహమాస్‌లో 30 మంది చనిపోయారని ప్రధాని హుబెర్ట్మిన్నిస్ చెప్పారు. వేలాదిమంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కనీసం 70 వేల మంది అత్యవసర సాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. బహమాస్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయని వివరించారు. శిథిలాల నుంచి వెలికి తీస్తున్న మృతదేహాలను ఉంచేందుకు బాడీ బ్యాగ్స్, కూలర్లను పంపించినట్లు ఆరోగ్య మంత్రి డువానె సాండ్స్చెప్పారు. సౌత్, నార్త్ కరోలినాలో కరెంటు లేక 2 లక్షల 71 వేల మందికిపైగా చీకట్లో మగ్గుతున్నారని వివరించారు. నార్త్‌కరోలినాలో గురువారం నుంచి పెనుగాలులతో పాటు కుండపోతగా వర్షం కురుస్తోందని అధికారులు చెప్పారు.

