భార్యను పొడిచి పారిపోయిన భర్త.. వెంటాడి పట్టుకున్న స్థానికులు

V6 Velugu Posted on Apr 08, 2021

  • తీవ్ర రక్తస్రావంతో భార్య మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు 

రంగారెడ్డి జిల్లా: హైదర్ షాకోట్ లో దారుణం జరిగింది. భార్యతో గొడవకు దిగి.. కోపంతో కత్తి తీసుకుని భార్యను పొడిచి.. ఇంటికి తాళం వేసి పారిపోతున్న భర్త బసప్ప ను స్థానికులు పరిగెత్తి.. వెంటాడి పట్టుకున్నారు. తాళం వేసిన ఇంటికి వచ్చి చూసేలోగా రక్తపు మడుగులో పడి ఉన్న అతని భార్య పద్మమ్మ కన్నుమూసింది. నార్సింగి పోలీస్  పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ గ్రామంలో జరిగిన ఘటన కలకలం రేపింది. బసప్ప.. అతని భార్య పద్మమ్మల మధ్య తరచూ గొడవలు.. వాగ్వాదాలు జరుగుతున్నాయి. గురువారం భార్యాభర్తల మధ్య గొడవ జరుగగా బసప్ప కోపంతో భార్యని అతి కిరాతకంగా పొడిచేశాడు. తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోతుంటే.. పద్మమ్మ ఆర్తనాదాలతో అనుమానించిన స్థానికులు.. నిందితుడైన ఆమె భర్త బసప్ప పారిపోతుంటే పరిగెత్తి పట్టుకున్నారు. స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. వీరి ఇంటి తాళం తెరిచి చూడగా లోపల ఒంటి పైన బట్టలు లేకుండా రక్తం మడుగులో పడి ఉన్నది పద్మమ్మ. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు భర్త బసప్ప అదుపులోకి తీసుకున్నారు.పద్మమ్మ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Tagged Rangareddy district, murder

More News