గచ్చిబౌలి, వెలుగు: వాటర్ట్యాంకర్ను బైక్ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. అతని భార్యకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా చిన్నవారి మడుగు గ్రామానికి చెందిన వీరపునేని కేశవులు(54), సరస్వతి దంపతులు తమ కుమారుడు సాయిరాంతో కలిసి గౌలిదొడ్డిలో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం కేశవులు, సరస్వతి బైక్పై గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. ఐఐఐటీ జంక్షన్ సమీపంలో రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపిన వాటర్ట్యాంకర్ను ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో కేశవులుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు సాయిరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
