భర్తలు తమ భార్యల్ని పిల్లలకంటే ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తారట. ఇదే విషయాన్ని సర్వే చేసి మరీ నిర్ధారించింది ఒక వెబ్ సైట్.పిల్లల కంటే ఎక్కువ ఒత్తి డికి గురిచేసేది భర్తలే అనేది ఆ వెబ్ సైట్ సర్వే సారాంశం. ఏడువేల మంది తల్లుల మీద ఈ స్టడీ చేశారు. స్టడీలో పాల్గొన్న వాళ్లని 'మీరు దేనివల్ల ఒత్తిడిగా ఫీలవు తున్నారు. ఇంటి బాధ్యతల వల్లనా. భర్త లేదా పిల్లల వల్లనా' అని అడిగారు. 46 శాతం మంది మా పిల్లల కంటే... భర్తల వల్లనే ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. ఆ ఒత్తిడి యావరేజ్ గా పదిలో 8.5గా ఉంది.
మీ భర్త వల్ల మీకు ఒత్తిడికి గురవుతుంటే... ఈ విషయాన్ని మీ భర్తతో చర్చించాలి. అధిక ఒత్తిడి ఆరోగ్యం, మీ పనుల మీద ప్రభావం చూపుతుంది.వాటిలో ఇంటికి అవసరమైన సరుకులు కొనడం, వంటపాత్రలు కడగడం, వంట చేయడం, పిల్లల చదువులో సాయం చేయడం వంటి ఇంటి పనులు ఉంటున్నాయి. ఈ పనులన్నీ భార్యాభర్తలిద్దరూ సమంగా పంచుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు.
ప్రతి నలుగురిలో ఒకరు ఇంటిపనులన్నీ చేసుకోవడంతో పాటు, పిల్లల పెంపకం కూడా చూసుకోవాల్సి వస్తోందని చెప్పారు. కాగా ప్రతి ఐదుగురిలో ఒకరికి భర్తనుంచి సరైన సాయం అందకపోగా... టైంకి పని పూర్తి చేయడంలేదని ఫిర్యాదులు చేస్తాడు. దీనివల్ల విపరీతమైన ఒత్తిడి ఉంటుందన్నారు. అంతేకాదు ఒంటరి తల్లులతో పోలిస్తే భర్తతో ఉన్న మహిళలకే ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉంటోంది.
