హుస్నాబాద్ లో ప్రత్యేక ట్రాఫిక్ పోస్ట్ ఏర్పాటు

హుస్నాబాద్ లో ప్రత్యేక ట్రాఫిక్ పోస్ట్ ఏర్పాటు
  • ఒక ఎస్ఐ, ఏడుగురు సిబ్బంది నియామకం

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీస్ కమిషనర్ విజయ్​కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రాఫిక్ పోస్ట్​ను ఏర్పాటు చేశారు. ఈ పోస్ట్​కు ఎస్ఐ శ్రీనివాస్​తో పాటు ఏడుగురు సిబ్బందిని కేటాయించారు. మల్లెచెట్టు, అంబేద్కర్ చౌరస్తా, అక్కన్నపేట రోడ్డుల్లో ట్రాఫిక్ జామ్​లను నియంత్రించనున్నారు. 

మైనర్లు వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేసి కేసులు కోర్టుకు పంపుతామని, నిబంధనలు అతిక్రమించే వారిపై ఈ-చలాన్లు విధిస్తామని సిద్దిపేట  ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.