రాష్ట్ర రాజకీయాల పై హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రభావం

రాష్ట్ర రాజకీయాల పై హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రభావం

రాష్ట్రం లో దుబ్బాక ఫలితం తర్వాత ఒక మార్పు వచ్చిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆరు నెలల కొకసారి ఓట్లు వస్తే బాగుండనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి రఘునందన్ రావు  హాజరైయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎన్నికలనగానే డబ్బులు, పథకాలతో ఇప్పుడు ప్రజలకు ఆశచూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల పై హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రభావం చూపనుందన్నారు. అంతేకాదు ..కేసీఆర్ సొంత గడ్డ అయిన దుబ్బాకలో జై బీజేపీ నినాదం గెలిచిందన్నారు.

 దుబ్బాక ఎన్నికలో కష్టపడినట్లు హుజురాబాద్ లో కష్ట పడాలని కర్యకర్తలను కోరారు రఘునందన్ రావు. ఒక కుటుంబంలోని వారంతా బీజేపీకి ఓట్లు వేసే విధంగా కృషి చేయాలని సూచించారు. అన్ని శక్తి కేంద్రాలు, బూతు కమిటీలు కష్టపడి హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపొందాలన్నారు. హుజురాబాద్ లో ఎన్నికలు రావడం కారణంగానే కేసీఆర్ నీళ్ల పంచాయితీ మొదలు పెట్టారన్నారు.

గ్రామ పంచాయితీ నిధులు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయని తెలిపారు ఎమ్మెల్యే రఘనందన్ రావు. రాష్ట్రంలో మైనింగ్ సెస్ గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.హుజురాబాద్ లో ఉప ఎన్నికల్లో TRS కంటే ఎక్కువ ఓట్ల తో గెలుస్తామని తేల్చి చెప్పారు.