Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉపఎన్నిక రిజల్ట్

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉపఎన్నిక రిజల్ట్

హుజూరాబాద్ బైపోల్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్

  • చివరి రౌండ్‎లోనూ ఈటలదే లీడ్
  • 23,855 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం

హుజురాబాద్ బై ఎలక్షన్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. కేవలం రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో బీజేపీనే అధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. 22వ రౌండ్‌లోనూ బీజేపీనే హవా కనబరిచింది. 22వ రౌండ్ లెక్కింపులో ఈటల రాజేందర్‌‌కు 5,048 ఓట్లు రాగా.. టీఆర్‌‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‎కు 3,715 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 109 ఓట్లు  వచ్చాయి. 22వ రౌండులో బీజేపీ 1,333 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 22 రౌండ్లలో కలిపి ఈటల రాజేందర్ ఈవీఎం ఓట్లలో 24,068 భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీకి 242 ఓట్లు, టీఆర్ఎస్ కు 455 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ఈటలకు వచ్చిన మొత్తం ఓట్లు 1,07,022కు చేరగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు వచ్చిన ఓట్లు 83,167కు చేరాయి. దీంతో ఈటల 23,855 ఓట్ల భారీ ఆధిక్యంతో హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

22వ రౌండ్

బీజేపీ: 5,048

టీఆర్‌‌ఎస్: 3,715

కాంగ్రెస్: 109

బీజేపీ లీడ్: 1,333

  • లక్ష దాటిన ఈటల ఓట్లు

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‎లో 21వ రౌండులో  బీజేపీ ఆధిక్యం సొంతం చేసుకుంది. 21వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 5151 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3431 ఓట్లు, కాంగ్రెస్‎కు 107 ఓట్లు వచ్చాయి. 21వ రౌండులో బీజేపీ 1,720 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 21 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 1,01,732 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 78,997 ఓట్లు, కాంగ్రెస్‎కు 2767 ఓట్లు నమోదయ్యాయి. 21 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 22,735 ఓట్ల భారీ ఆధిక్యాన్ని కైవసం చేసుకున్నారు.

21వ రౌండు
బీజేపీ 5151
టీఆర్ఎస్ 3431
కాంగ్రెస్ 136
బీజేపీ లీడ్ 1,720

  • 20వ రౌండ్‎ ముగిసేసరికి బీజేపీకి 21 వేల లీడ్

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‎లో 20వ రౌండులో  బీజేపీ ఆధిక్యం సొంతం చేసుకుంది. 20వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 5269 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3795 ఓట్లు, కాంగ్రెస్‎కు 107 ఓట్లు వచ్చాయి. 20వ రౌండులో బీజేపీ 1,474 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 20 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 96,581 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 75,566 ఓట్లు, కాంగ్రెస్‎కు 2767 ఓట్లు నమోదయ్యాయి. 20 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 21,015 ఓట్ల భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

20వ రౌండు
బీజేపీ 5269
టీఆర్ఎస్ 3795
కాంగ్రెస్ 107
బీజేపీ లీడ్ 1,474

  • 19వ రౌండ్‎లో ఈటలకు భారీ లీడ్

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‎లో 19వ రౌండులో  బీజేపీకి భారీ ఆధిక్యం లభించింది. 19వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 5916 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 2869 ఓట్లు, కాంగ్రెస్‎కు 97 ఓట్లు వచ్చాయి. 19వ రౌండులో బీజేపీ 3,047 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 19 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 91,312 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 71,771 ఓట్లు, కాంగ్రెస్‎కు 2660 ఓట్లు నమోదయ్యాయి. 19 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 19,541 ఓట్ల భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

19వ రౌండు
బీజేపీ 5916
టీఆర్ఎస్ 2869
కాంగ్రెస్ 97
బీజేపీ లీడ్ 3,047

  • 18వ రౌండ్‎లో బీజేపీకి 1800 లీడ్‎

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‎లో 18వ రౌండులో  బీజేపీ ఆధిక్యం సొంతం చేసుకుంది. 18వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 5611 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3735 ఓట్లు, కాంగ్రెస్‎కు 94 ఓట్లు వచ్చాయి. 18వ రౌండులో బీజేపీ 1,876 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 18 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 85,396 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 68,902 ఓట్లు, కాంగ్రెస్‎కు 2563 ఓట్లు నమోదయ్యాయి. 18 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 16,494 ఓట్ల ఆధిక్యాన్ని కైవసం చేసుకున్నారు.

18వ రౌండు
బీజేపీ 5611
టీఆర్ఎస్ 3735
కాంగ్రెస్ 94
బీజేపీ లీడ్ 1,876

  • 17వ రౌండ్‎లో బీజేపీకి 1400 లీడ్

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‎లో 17వ రౌండులో  బీజేపీ ఆధిక్యం సొంతం చేసుకుంది. 17వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 5610 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4187 ఓట్లు, కాంగ్రెస్‎కు 203 ఓట్లు వచ్చాయి. 17వ రౌండులో బీజేపీ 1,423 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 17 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 79,785 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 65,167 ఓట్లు, కాంగ్రెస్‎కు 2469 ఓట్లు నమోదయ్యాయి. 17 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 14,618 ఓట్ల ఆధిక్యాన్ని కైవసం చేసుకున్నారు.

17వ రౌండు
బీజేపీ 5610
టీఆర్ఎస్ 4187
కాంగ్రెస్ 203
బీజేపీ లీడ్ 1,423

  • 16వ రౌండ్‎ ముగిసేసరికి 13 వేలు దాటిన ఈటల లీడ్

16వ రౌండులో బీజేపీకి భారీ ఆధిక్యం లభించింది. 16వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 5689 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3977 ఓట్లు, కాంగ్రెస్‎కు 135 ఓట్లు వచ్చాయి. 16వ రౌండులో బీజేపీ 1,712 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 16 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 74,175 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 60,980 ఓట్లు, కాంగ్రెస్‎కు 2266 ఓట్లు నమోదయ్యాయి. 16 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 13,195 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

16వ రౌండు
బీజేపీ 5689
టీఆర్ఎస్ 3977
కాంగ్రెస్ 135
బీజేపీ లీడ్ 1,712

  • 15వ రౌండ్‎లో ఈటలకు 2వేలకు పైగా లీడ్

15వ రౌండులో బీజేపీకి భారీ ఆధిక్యం లభించింది. 15వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 5407 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3358 ఓట్లు, కాంగ్రెస్‎కు 149 ఓట్లు వచ్చాయి. 15వ రౌండులో బీజేపీ 2,049 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 15 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 68,486 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 57,003 ఓట్లు, కాంగ్రెస్‎కు 2131 ఓట్లు నమోదయ్యాయి. 15 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 11,483 ఓట్ల ఆధిక్యాన్ని కైవసం చేసుకున్నారు.

15వ రౌండు
బీజేపీ 5407
టీఆర్ఎస్ 3358
కాంగ్రెస్ 149
బీజేపీ లీడ్ 2,049

  • 14 రౌండ్లలో 10 వేలకు చేరువలో బీజేపీ లీడ్

14వ రౌండులో బీజేపీకి ఆధిక్యం లభించింది. 14వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 4746 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3700 ఓట్లు, కాంగ్రెస్‎కు 152 ఓట్లు వచ్చాయి. 14వ రౌండులో బీజేపీ 1,046 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 14 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 63,079 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 53,645 ఓట్లు, కాంగ్రెస్‎కు 1982 ఓట్లు నమోదయ్యాయి. 14 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 9,434 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

14వ రౌండు
బీజేపీ 4746
టీఆర్ఎస్ 3700
కాంగ్రెస్ 152
బీజేపీ లీడ్ 1,046

  • డిపాజిట్ కూడా దక్కించుకోలేని స్థితిలో కాంగ్రెస్

హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టంగా మారింది. ఇప్పటివరకు లెక్కించిన లక్ష ఓట్లలో కాంగ్రెస్‎కు కేవలం 1700 ఓట్లు మాత్రమే పడటం ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. కానీ, ఈ సారి మాత్రం కాంగ్రెస్‎కు ఓట్లు భారీగా తగ్గాయి.

  • 13వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి భారీ ఆధిక్యం 

13వ రౌండులో బీజేపీ ఆధిక్యం సాధించింది. 13వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 4836 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 2971 ఓట్లు, కాంగ్రెస్‎కు 101 ఓట్లు వచ్చాయి. 13వ రౌండులో బీజేపీ 1,865 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 13 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 58,333 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 49,945 ఓట్లు, కాంగ్రెస్‎కు 1830 ఓట్లు నమోదయ్యాయి. 13 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 8,388 ఓట్ల ఆధిక్యాన్ని కైవసం చేసుకున్నారు. 

13వ రౌండు
బీజేపీ 4836
టీఆర్ఎస్ 2971
కాంగ్రెస్ 101
బీజేపీ లీడ్ 1,865

  • 12వ రౌండ్‎లో లీడ్ సాధించిన బీజేపీ 

12వ రౌండులో బీజేపీ ఆధిక్యం సాధించింది. 12వ రౌండ్ లెక్కింపులో ఈటలకు 4849 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3632 ఓట్లు, కాంగ్రెస్‎కు 158 ఓట్లు వచ్చాయి. 12వ రౌండులో బీజేపీ 1,217 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 12 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 53,497 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 46,974 ఓట్లు, కాంగ్రెస్‎కు 1729 ఓట్లు నమోదయ్యాయి. 12వ రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6,523 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. 

12వ రౌండు
బీజేపీ 4849
టీఆర్ఎస్ 3632
కాంగ్రెస్ 158
బీజేపీ లీడ్ 1,217

  • 11 రౌండ్‎లో లీడ్‎లోకొచ్చిన టీఆర్ఎస్

11వ రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ కేవలం రెండు రౌండ్లలోనే లీడ్ సాధించింది. పదకొండో రౌండ్ లెక్కింపులో ఈటలకు 3941 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4326 ఓట్లు, కాంగ్రెస్‎కు 104 ఓట్లు వచ్చాయి. 11వ రౌండులో టీఆర్ఎస్ 367 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 11 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 48,648 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 43,324 ఓట్లు, కాంగ్రెస్‎కు 1571 ఓట్లు నమోదయ్యాయి. 11వ రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5,306 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

11వ రౌండు
బీజేపీ 3941
టీఆర్ఎస్ 4326
కాంగ్రెస్ 104
టీఆర్ఎస్ లీడ్ 367

  • పదిరౌండ్లలో 9 రౌండ్లు బీజేపీదే లీడ్

పదో రౌండులో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పదో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4235 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3709 ఓట్లు, కాంగ్రెస్‎కు 94 ఓట్లు వచ్చాయి. పదో రౌండులో బీజేపీ 526 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. పది రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 44,707 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 39,016 ఓట్లు, కాంగ్రెస్‎కు 1467 ఓట్లు నమోదయ్యాయి. పది రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5,691 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

పదో రౌండు
బీజేపీ 4295
టీఆర్ఎస్ 3709
కాంగ్రెస్ 118
బీజేపీ లీడ్ 526

  • లెక్కించింది 82,450 ఓట్లు.. లెక్కించాల్సింది 1,22,786

మొత్తం 22 రౌండ్లకు గానూ.. ఇప్పటివరకు హుజురాబాద్, వీణవంక మండలాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు 82 వేల 450 ఓట్లు లెక్కించగా.. ఇంకా 1,22,786 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం 10వ రౌండు నుంచి 16 రౌండు వరకు జమ్మికుంటకు చెందిన కౌంటింగ్ జరగనుంది. జమ్మికుంట మండలంలో 64,915 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 16 నుంచి 22 వరకు ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు మండలాల్లో 57,871 ఓట్లు పోలయ్యాయి. 

  • తొమ్మిదో రౌండులో బీజేపీకి భారీ ఆధిక్యం

తొమ్మిదో రౌండులో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు కౌంటింగ్ జరిగిన అన్ని రౌండ్లలో తొమ్మిదో రౌండ్లో అత్యధికంగా 1,835 ఓట్ల మెజారిటీని ఈటల సొంతం చేసుకున్నారు. తొమ్మిదో రౌండ్ లెక్కింపులో ఈటలకు 5,305 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3,470 ఓట్లు, కాంగ్రెస్ కు 174 ఓట్లు వచ్చాయి. తొమ్మిదో రౌండులో బీజేపీ 1,835 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. తొమ్మిది రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 40,412 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 35,307 ఓట్లు, కాంగ్రెస్ కు 1,349 ఓట్లు నమోదయ్యాయి. తొమ్మిది రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5,105 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

9వ రౌండ్
బీజేపీ: 5,305

టీఆర్ఎస్: 3,470

కాంగ్రెస్: 174

బీజేపీ ఆధిక్యం: 1,835 ఓట్లు

  • ఫస్ట్ టైం లీడ్ సాధించిన టీఆర్ఎస్

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాల్లో తొలిసారిగా టీఆర్ఎస్ ఎనిమిదో రౌండులో లీడ్‎ను దక్కించుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరైన హిమ్మత్ నగర్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించింది. ఎనిమిదో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4086 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4248 ఓట్లు, కాంగ్రెస్‎కు 89 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో రౌండులో టీఆర్ఎస్ 162 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఎనిమిది రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 35,107 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 31,837 ఓట్లు, కాంగ్రెస్‎కు 1175 ఓట్లు నమోదయ్యాయి. ఎనిమిది రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3270 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

ఎనిమిదో రౌండు
బీజేపీ 4086
టీఆర్ఎస్ 4248
కాంగ్రెస్ 89
టీఆర్ఎస్ లీడ్ 162

  • ఏడో రౌండులోనూ తగ్గని బీజేపీ ఆధిక్యం

ఏడో రౌండులో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఏడో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4038 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3792 ఓట్లు, కాంగ్రెస్‎కు 94 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండులో బీజేపీ 246 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఏడు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 31,021 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 27,589 ఓట్లు, కాంగ్రెస్‎కు 1086 ఓట్లు నమోదయ్యాయి. ఏడు రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3, 432 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

ఏడో రౌండు
బీజేపీ 4038
టీఆర్ఎస్ 3792
కాంగ్రెస్ 94
బీజేపీ లీడ్ 246

  • ముందు నుంచి ఆధిక్యంలోనే ఈటల

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‎లో బీజేపీ మొదటినుంచి ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మొదటి రౌండులో వందకుపైగా లీడ్ సాధించిన ఈటల.. ప్రతి రౌండులోనూ లీడ్‎ను కొనసాగిస్తూ ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి 3 వేలకు పైగా లీడ్‎ను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ ద్వారా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా.. ఓటర్లు ఈటలకు ఓటేసినట్లు అర్థమవుతోంది.

  • ఆరో రౌండులో బీజేపీకి 1000కి పైగా లీడ్

ఆరో రౌండులో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆరో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4656 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3639 ఓట్లు, కాంగ్రెస్‎కు 180 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండులో బీజేపీ 1017 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఆరు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 26,983 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 23,797 ఓట్లు, కాంగ్రెస్‎కు 992 ఓట్లు నమోదయ్యాయి. ఆరు రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3,186 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

ఆరో రౌండు
బీజేపీ 4656
టీఆర్ఎస్ 3639
కాంగ్రెస్ 180
బీజేపీ లీడ్ 1017

  • వరుసగా అయిదో రౌండు‎లోనూ ఈటలదే లీడ్

అయిదో రౌండులో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయిదో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4358 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4014 ఓట్లు, కాంగ్రెస్‎కు 132 ఓట్లు వచ్చాయి. అయిదో రౌండులో బీజేపీ 344 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఐదు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 22,327 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 20,158 ఓట్లు, కాంగ్రెస్‎కు 812 ఓట్లు నమోదయ్యాయి. ఐదు రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2,169 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

అయిదవ రౌండు
బీజేపీ 4358
టీఆర్ఎస్ 4014
కాంగ్రెస్ 132
బీజేపీ లీడ్ 344

  • నాలుగో రౌండు‎లోనూ తగ్గని బీజేపీ జోరు

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలలో బీజేపీ మొదటినుంచి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. నాలుగో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4444 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3882 ఓట్లు, కాంగ్రెస్‎కు 234 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండులో బీజేపీ 562 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. నాలుగురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 17,969 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు నాలుగురౌండ్లలో కలిపి 16,144 ఓట్లు లభించాయి. కాంగ్రెస్‎కు నాలుగురౌండ్లలోనూ కలిపి 680 ఓట్లు నమోదయ్యాయి. నాలుగురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1825 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

నాలుగో రౌండు
బీజేపీ 4444
టీఆర్ఎస్ 3882
కాంగ్రెస్ 234
బీజేపీ లీడ్ 562

  • మూడోరౌండ్‎లోనూ బీజేపీదే ఆధిక్యం

హుజురాబాద్ పట్టణంలో కూడా బీజేపీ ముందంజలో ఉంది. ఉపఎన్నిక సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావులు  ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అయినా కూడా పట్టణంలో మూడోరౌండు ముగిసేసరికి బీజేపీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మూడోరౌండ్ లెక్కింపులో ఈటలకు 4064 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3159 ఓట్లు, కాంగ్రెస్‎కు 107 ఓట్లు వచ్చాయి. మూడోరౌండులో బీజేపీ 905 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. మూడురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 13,525 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు మూడురౌండ్లలో కలిపి 12,262 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ కు మూడురౌండ్లలోనూ కలిపి 446 ఓట్లు నమోదయ్యాయి. మూడురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1263 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

మూడోరౌండు
బీజేపీ 4064
టీఆర్ఎస్ 3159
కాంగ్రెస్ 107
బీజేపీ లీడ్ 905

  • మూడోరౌండ్‎లో ఈవీఎం మొరాయింపు

మూడోరౌండ్ కౌంటింగ్‎లో ఒక ఈవీఎం మొరాయించడంతో ఎన్నికల అధికారులు ఆ ఈవీఎంను పక్కన పెట్టి.. కౌంటింగ్ కొనసాగిస్తున్నారు.

  • మూడోరౌండ్‎లోనూ  బీజేపీదే ఆధిక్యం

హుజురాబాద్ పట్టణంలో కూడా బీజేపీ ముందంజలో ఉంది. మూడోరౌండు ముగిసేసరికి బీజేపీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మూడోరౌండులో బీజేపీ 905 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. మూడురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1263 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

  • రెండోరౌండు ముగిసేసరికి బీజేపీదే ఆధిక్యం

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ముందంజలో ఉంది. రెండోరౌండ్ లెక్కింపులో ఈటలకు 4851 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4659 ఓట్లు, కాంగ్రెస్‎కు 220 ఓట్లు వచ్చాయి. రెండోరౌండులో బీజేపీ 192 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 9461 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు రెండురౌండ్లలో కలిపి 9103 ఓట్లు లభించాయి. రెండురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి 358 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

రెండోరౌండు
బీజేపీ 4851
టీఆర్ఎస్ 4659
కాంగ్రెస్ 220
బీజేపీ లీడ్ 192

  • ఫస్ట్ రౌండులో నోటాకు 51 ఓట్లు

హుజురాబాద్ మండలంలో ఇప్పటివరకు సాగిన మొదటి రౌండు కౌంటింగ్‎లో నోటాకు 51 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ లో కొనసాగుతున్నారు.

  • దళితబంధు ప్రారంభించిన గ్రామంలోనూ ఈటలకు లీడ్

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దళితబంధు, రైతుబంధు పథకాలను ప్రారంభించిన శాలపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‎కు లీడ్ లభించింది. దీనిని బట్టి చూస్తే అధికారపార్టీ ప్రజలను ఆకట్టుకోలేకపోయిందనిపిస్తోంది.

  • కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు

కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు 119 ఓట్లు రాగా.. ప్రజాపక్త పార్టీకి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ కు (రోటీ మేకర్ గర్తు) 122 ఓట్లు వచ్చాయి. మరో ఇండిపెండెంట్ అభ్యర్ధి డైమండ్ గుర్తుకు చెందిన సాయన్నకు 113 ఓట్లు వచ్చాయి.

  • తొలిరౌండులో బీజేపీ ఆధిక్యం

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ బోణీ కొట్టింది. హుజురాబాద్ మండలానికి చెందిన ఈవీఎంల లెక్కింపులో ఈటలకు 4610 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్ కు 4444 ఓట్లు, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి. తొలిరౌండులో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది.

తొలిరౌండు

బీజేపీ 4610
టీఆర్ఎస్ 4444
కాంగ్రెస్ 119
బీజేపీ లీడ్ 166
నోటా 51

  • మొదలైన ఈవీఎం కౌంటింగ్

హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి ఈవీఎం ఓట్ల కౌంటింగ్ మొదలైంది. మొదటగా హుజురాబాద్ మండలానికి చెందిన ఈవీఎంలను లెక్కిస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఫలితం మాత్రం ఇంకా అధికారికంగా వెలువడలేదు.

  • మరికాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ తీరును కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతోంది. మరికాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తికానుంది. అయితే బ్యాలెట్ ఫలితాలు మాత్రం ముందే ప్రకటిస్తారా లేక ఈవీఎంల లెక్కింపు తర్వాత వెల్లడిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

  • మొదలైన హుజురాబాద్ కౌంటింగ్

మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అరగంట సమయంలో ఈ ఫలితం రానుంది. ఇవి మొత్తం 753 ఉన్నాయి. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ లో భాగంగా ఒక్కోరౌండులో 9 వేల నుంచి 11 వేల ఓట్లు లెక్కించనున్నారు. ఒక్కోరౌండులో 14 ఈవీఎంలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

  • మొదట హుజురాబాద్.. చివరగా కమలాపూర్

మొదట హుజూరాబాద్ మండలంలోని ఓట్లను లెక్కించనున్నారు. మొదటి రౌండు నుంచి ఆరో రౌండు వరకు హుజురాబాద్ ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఈ క్రమంలో మొదటగా హుజురాబాద్ ఓట్ల లెక్కింపు.. చివరగా కమలాపూర్ మండల ఓట్లు లెక్కించనున్నారు.

  • కౌంటింగ్ హాల్ దగ్గర పోలీసులకు, ఏజెంట్లకు వాగ్వాదం

కౌంటింగ్ హాల్‎లోకి వచ్చే ఏజెంట్లకు గేట్ పాస్‎తో పాటు వ్యక్తిగత ఐడీ కార్డు కూడా తప్పనిసరి అని పోలీసులు చెబుతున్నారు. ఐడీ కార్డు లేని కొంతమంది ఏజెంట్లను పోలీసులు గేటు దగ్గరే ఆపేశారు. దాంతో ఏజెంట్లకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఐడీ కార్డు తప్పనిసరి అని చెప్పడంతో గేట్ నెంబర్ 2 దగ్గర కౌంటింగ్ ఏజెంట్లు బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు నిరసనగా ధర్నాకు దిగారు. దాంతో ఏజెంట్ల పేరు, వివరాలు నమోదు చేసుకొని ఏజెంట్లను లోపలికి అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.

  • కాసేపట్లో మొదలుకానున్న హుజూరాబాద్ కౌంటింగ్
  • కౌంటింగ్‎కు సర్వం సిద్దం

కరీంనగర్: మరి కాసేపట్లో హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ మొదలుకానుంది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో అధికారులు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో 150 మంది సిబ్బంది పాల్గొననున్నారు. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. ఈ పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 753గా ఉన్నాయి. మొత్తం ఈవీఎంలు 306 కాగా.. ఒక్కో రౌండుకు 14 ఈవీఎంలు లెక్కించనున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్ లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. 
ఒక హాల్లో 7 టేబుళ్ల చొప్పున.. ప్రతి రౌండుకు 14 టేబుల్స్ పై  14 ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పరిశీలించనున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఈ కౌంటింగ్ పూర్తికానుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,37,036 ఓట్లు కాగా.. వాటిలో పురుషుల ఓట్లు 1,17,779, మహిళల ఓట్లు 1,19,093. అయితే ఈ ఉపఎన్నికలో 2,05,236 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుషుల ఓట్లు 1,02,523, మహిళ ఓట్లు 1,02,712 పోలయ్యాయి. మొత్తం పోలింగ్ శాతం 86.64 శాతంగా అధికారులు ప్రకటించారు. 

కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేశారు. స్ట్రాంగ్ రూం దగ్గర, కౌంటింగ్ హాల్ దగ్గర కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. కౌంటింగ్ హాల్ గేటు లోపల, బయట 650 మందికి పైగా పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రులైన గంగుల కమలాకర్ ఇంటితో పాటు ఎంపీ బండి సంజయ్ ఇంటి దగ్గర ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలో పలుచోట్ల పికెటింగులు కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరుగుతున్న గల్లీల్లొ ఎవరూ గుమికూడకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సిబ్బంది, అధికారులను గేట్ నెంబర్ వన్ ద్వారా అనుమతించనున్నారు. అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులను గేట్ నెంబర్ టు ద్వారా లోపలికి వెళ్ళేందుకు అనుమతించనున్నారు. కరీంనగర్ తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గం అంతటా ఎక్కడా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. గెలిచిన తర్వాత ధృవీకరణ పత్రం తీసుకునేందుకు అభ్యర్థితో పాటు మరో వ్యక్తిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. పాస్ లు ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్లే వాహనాలను గీతా భవన్ చౌరస్తా నుంచి చింతకుంట మీదుగా దారి మళ్లింపు చేశారు. జగిత్యాల నుంచి కరీంనగర్ వచ్చే వాహనాలను రేకుర్తి, చింతకుంట మీదుగా దారి మళ్లించారు.