ఇవాళ ( జనవరి 9 ) హైదరాబాద్కు నిఖిత డెడ్ బాడీ

ఇవాళ ( జనవరి 9 ) హైదరాబాద్కు నిఖిత డెడ్ బాడీ

తార్నాక, వెలుగు: అమెరికాలో హత్యకు గురైన గొడిశాల నిఖిత మృతదేహం శుక్రవారం హైదరాబాద్​కు చేరుకోనున్నది. గత నెల 31న  మేరీ ల్యాండ్ లోని కొలంబియా ప్రాంతంలోని ఆమె ఫ్రెండ్​ అర్జున్ శర్మ ఇంట్లో నిఖిత డెడ్​బాడీని పోలీసులు గుర్తించారు. నిఖిత వాహనం కూడా అక్కడే ఉంది. నిఖిత శరీరంపై అనేక కత్తిపోట్లు గుర్తించారు. డిసెంబర్ 31న సాయంత్రం 7 గంటల సమయంలో హత్య జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. 

అర్జున్ శర్మ గురించి వెతకగా అతడు ఇండియా పారిపోయి వచ్చాడని సమాచారం దొరికింది. అయితే, నిందితుడిని అరెస్ట్​ చేసినట్టు పలు మీడియాల్లో   వచ్చాయి. అయితే, దీన్ని నిఖిత కుటుంబసభ్యులు ఖండించారు. నిందితుడు అర్జున్ శర్మ ఇంకా పరారీలోనే ఉన్నాడని తెలిపారు. అతన్ని అరెస్టు చేశారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. నిఖిత మృతదేహం శుక్రవారం హైదరాబాద్​ రానుందని,  అంత్యక్రియల కోసం  పోలీస్​ప్రొటెక్షన్ ​కోరామని చెప్పారు.