రాజధానిలో 7 వందల ఏళ్ల..ఏనుగు చెట్టు

రాజధానిలో 7 వందల ఏళ్ల..ఏనుగు చెట్టు

హైదరాబాద్:  భాగ్యనగరం చారిత్రక సంపదకు నిలయం. వందల ఏళ్ల నా టి కట్టడాలు చెక్కుచె దరకుండా అంతే వైభవంతో విరాజిల్లుతు న్నాయి. అదే కోవలోకి వస్తోంది 7 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఏనుగు( బోబాబ్) చెట్టు. అంత పెద్ద సైజులో ఉన్నప్పటికీ పచ్చని ఆకులతో కళకళలాడుతుంది. పర్యాటక ప్రాంతంలో ఉన్నా అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుంది. ఎవరు పెట్టారు. అనే వివరాలు , విశేషాలు ఓ సారి చూద్దాం.

ఈ చెట్టును ఎవరు నాటారంటే గోల్కొండ కోటకు 2 కిలో మీటర్ల దూరంలో గోల్కొండ గోల్ఫ్ కోర్స్ కి ఆనుకుని ఉన్న స్థలంలో ఇది ఉంటుంది. దీని అసలు పేరు బోబాబ్ (హథియన్‌‌ జాడ్ ). 25 మీటర్ల చుట్టు కొలత కలిగి ఉంటుంది. 7 వందల ఏళ్ల క్రితం దేశ సంచారం చేసే మౌల్వీలు దీనిని మడగాస్కర్ నుంచి తెచ్చి ఇక్కడ పాతిపెట్టినట్టు శిలాఫలకంలో తెలిపారు. ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఈ చెట్లు వేర్లలో నీటిని నిల్వ చేసుకుంటాయి. ఒక్కో చెట్టు లక్ష లీటర్ల నీటిని దాచుకుంటుంది. హిందూ పురాణాల్లో దీన్ని కల్పవృక్షం అంటారు. మన దేశంలో ఇవి 10 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి మన సిటీలో ఉండటం గమనార్హం.

జీవితకాలం వేల ఏళ్లు..బోబాబ్‌‌ చెట్లు వేల ఏళ్లు బతుకుతాయి..

ఆఫ్రికాలో ఇప్పటికీ ఓ చెట్టు వయసు 4 వేల సంవత్సరాలకు పైనే ఉంది. ఈ చెట్ల పండ్లు అత్యంత ఖరీదైనవి. వాటి పొడిని ఐస్ క్రీములు, జామ్‌ లు, చాక్లెట్లు, ఫేస్ క్రీములు, మందులు, కొన్ని రకాల టీలలో వాడతారు. అంతేకాదు కోరిన కోర్కెలు తీర్చుతుందని కూడా నమ్ముతారు. చాలా వ్యా ధుల్ని నయం చేసే గుణాలు వీటికున్నాయి. అందమైన తెల్లని పూలు కూడా పూస్తాయి. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ లో చూడొచ్చు. ఈ చెట్టును క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే  జంతువుల ముఖాల ఆకారాలు కనిపిస్తాయి. వాటిలో ఏనుగు తల, కాళ్లు, మొసలి, డీర్, పాం డా, హిప్పోపొటమస్, తాబేలు, పిల్లి, వన్ సైడ్ హ్యుమన్ ఫేస్, వంటి ఆకృతులు చూడొచ్చు. 15 ఏళ్ల కిందట ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెట్టు చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. దీని పరిరక్షణను ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చూస్తున్నారు.