టీఎస్ ​సెట్ ఫీజును తగ్గించాలి

టీఎస్ ​సెట్ ఫీజును తగ్గించాలి

ఓయూ, వెలుగు : టీఎస్​సెట్– 2024 ఎగ్జామ్​ఫీజును తగ్గించాలని, ఇంగ్లీష్ తోపాటు తెలుగులో ఎగ్జామ్​నిర్వహించాలని ఏబీవీపీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం టీఎస్ సెట్ కన్వీనర్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. టీఎస్ సెట్ ఎగ్జామ్​ఫీజు నేషనల్​లెవల్​లో నిర్వహించే యూజీసీ

నెట్ ఫీజుల కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని కోరారు. స్థానిక భాషల్లో ఎగ్జామ్ నిర్వహించకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఫోక్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు ఎగ్జామ్స్​ నిర్వహించాలని కోరారు.