- 2 కోట్లు దాటనున్న రాష్ట్ర రాజధాని జనాభా
- 2025 జనాభా ప్రాతిపదికన 1.85 కోట్లకు చేరిన పాపులేషన్
- 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీనంతో భారీగా పెరగనున్న విస్తీర్ణం
- జనాభా పరంగా ఇండియాలోనూ టాప్ 3 ప్లేస్‌లోకి హైదరాబాద్!
- రాష్ట్ర జనాభాలో సగం ప్రజలు నివసించేది ఇక్కడే
- పెరిగే విస్తీర్ణం, జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వం కార్యాచరణ
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ టాప్ టెన్ మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్‌కు చోటు దక్కబోతున్నది. త్వరలో లాస్ ఏంజిల్స్, బీజింగ్ లాంటి మహా నగరాల సరసన మన నగరం నిలువబోతున్నది. జనాభా పరంగా చూసినా ఇండియాలో టాప్ త్రీ ప్లేస్ దక్కించుకోనున్నది. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల విలీనంతో ఇది సాధ్యం కాబోతున్నది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అవతరించడానికి అనువైన నైసర్గిక స్వరూపం పెరగనున్నది. సుమారు 2 వేల చదరపు కి.మీ. విస్తీర్ణంతో అతి విశాలమైన నగరంగా రూపాంతరం చెందనున్నది.
దీంతో నగర జనాభా 2025 జనాభా ప్రాతిపదికన 1.85 కోట్లు దాటనున్నది. ఫలితంగా రాష్ట్ర జనాభాలో సగం ప్రజలు ఈ మెగా సిటీలోనే నివసించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నది. 2 కోట్ల జనాభా నివసించే నగరాలను గ్లోబల్, మెగాసిటీలుగా పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఆసియా, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. యునైటేడ్ నేషన్స్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ జనాభా నివసించే పట్టణం జపాన్ దేశంలోని టోక్యో నగరం.
ఇది అతిపెద్ద మెట్రో పాలిటన్ సిటీ కాగా.. ఇక్కడ 37.2 మిలియన్ల జనాభా నివసిస్తున్నారు. ఆ దేశ టెక్నాలజీ, ఫైనాన్స్, కల్చరల్ వంటి రంగాలకు కేంద్రంగా పనిచేస్తుంది. ఆ తర్వాత స్థానాల్లో భారతదేశ రాజధాని ఢిల్లీ, చైనా దేశానికి చెందిన షాంఘై, బంగ్లాదేశ్‌లోని ఢాకా, బ్రెజిల్ దేశంలోని సౌ పాలో, మెక్సికో సిటీ, ఈజిప్ట్‌లోని కైరో, చైనాకు చెందిన బీజింగ్, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వంటి పట్టణాలు ఉన్నాయి. త్వరలో హైదరాబాద్ సిటీ చేరనుంది.
ప్రపంచపటంలో భాగ్యనగరం..
ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నది. 2 కోట్ల జనాభా నివసించే నగరాలను గ్లోబల్, మెగాసిటీలుగా పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఆసియా, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. యునైటేడ్ నేషన్స్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ జనాభా నివసించే పట్టణం జపాన్ దేశంలోని టోక్యో నగరం.
ఇది అతిపెద్ద మెట్రో పాలిటన్ సిటీ కాగా.. ఇక్కడ 37.2 మిలియన్ల జనాభా నివసిస్తున్నారు. ఆ దేశ టెక్నాలజీ, ఫైనాన్స్, కల్చరల్ వంటి రంగాలకు కేంద్రంగా పనిచేస్తుంది. ఆ తర్వాత స్థానాల్లో భారతదేశ రాజధాని ఢిల్లీ, చైనా దేశానికి చెందిన షాంఘై, బంగ్లాదేశ్‌లోని ఢాకా, బ్రెజిల్ దేశంలోని సౌ పాలో, మెక్సికో సిటీ, ఈజిప్ట్‌లోని కైరో, చైనాకు చెందిన బీజింగ్, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వంటి పట్టణాలు ఉన్నాయి. త్వరలో హైదరాబాద్ సిటీ చేరనుంది.
జనాభా పరంగా ఇండియాలో టాప్ 3 ప్లేస్
భారతదేశంలో జనాభా పరంగా చూస్తే అతిపెద్ద నగరాలుగా దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతోపాటు బెంగళూరు, కోల్‌కతా, చెన్నై వంటి మెగా సిటీలు ముందున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా 16.3 మిలియన్లు కాగా.. యునైటెడ్ నేషన్స్, వరల్డ్ పాపులేషన్ రివ్యూ వంటి సంస్థల లెక్కల ప్రకారం 2025లో ఢిల్లీ నగర జనాభా 34 మిలియన్లకు చేరింది. ఇదే లెక్కన 2025 అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్న నగరాలు 39 ఉన్నాయి. వీటిలో జనాభా ప్రాతిపదికన ఇప్పటిదాకా టాప్ 5లో ఉన్న కోల్‌కతా.
బెంగుళూరు, చెన్నై నగరాలను దాటేసి ఇప్పుడు హైదరాబాద్ మెగాసిటీ టాప్ త్రీలోకి చేరబోతున్నది. ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా, బాలీవుడ్ హబ్‌గా పేరొందిన ముంబై పట్టణానికి అతి చేరువలోకి వచ్చేసింది. ముంబైలో ప్రస్తుతం 2.1 కోట్ల జనాభా నివసిస్తుండగా.. హైదరాబాద్ సిటీలో 1.85 కోట్ల జనాభా నివసిస్తున్నారు. మారుతున్న కాలమాణ పరిస్థితులను బట్టి హైదరాబాద్ చుట్టూరా డెవలప్మెంట్ పెరిగి అతికొద్ది సంవత్సరాల్లోనే ఇక్కడి జనాభా ముంబైను దాటవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే బెంగుళూరు, కోల్‌కతా, చెన్నై పట్టణాలను దాటేసిన భాగ్యనగరం త్వరలోనే దేశంలో రెండో స్థానంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని వారు అంటున్నారు.
రాష్ట్ర జనాభాలో సగం హైదరాబాద్‌లోనే!
2001 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ సిటీ జనాభా 36.4 లక్షలు కాగా 2011 నాటికి 68.10 లక్షలకు పెరిగింది. ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వచ్చిన వాళ్లతో గడిచిన 14 ఏండ్లలో హైదరాబాద్ సిటీలో జనాభా విపరీతంగా పెరిగింది. ఇదే క్రమంలో పట్టణ విస్తీర్ణం పెంచుతూ జీహెచ్ఎంసీ పరిధిని పెంచారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ నగరం చుట్టూరా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను హైదరాబాద్ మెగా సిటీలో విలీనం చేస్తూ నవంబర్ 25న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆఫీసర్లు దీనికి అవసరమైన చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే ప్రభుత్వ పరంగా జీవో జారీ కానున్నది.
ప్రస్తుతం 2025 అంచనాల ప్రకారం ఇప్పటికే హైదరాబాద్ సిటీలో 1.40 కోట్ల జనాభా ఉండగా.. కొత్తగా విలీనం చేస్తున్న 27 అర్బన్ లోకల్ బాడీల పరిధిలోని పట్టణాల నుంచి మరో 45 లక్షల జనాభా కలిపి మొత్తంగా 1.85 కోట్ల జనాభా హైదారాబాద్ మెగాసిటీలో నివసిస్తున్నట్లుగా ఆఫీసర్లు లెక్కేస్తున్నారు. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3.50 కోట్లు కాగా.. యునైటెడ్ నేషన్స్, వరల్డ్ పాపులేషన్ రివ్యూ వంటి సంస్థల అంచనాల ప్రకారం 2025 నాటికి 3.85 కోట్లకు పెరిగినట్లు చెప్తున్నారు. దీంతో ఈ లెక్కన రాష్ట్ర జనాభాలో సగం ప్రజలు హైదరాబాద్ మెగాసిటీలోనే నివసిస్తున్నట్లుగా ఆఫీసర్లు పేర్కొంటూ.. దీనికి తగ్గట్టు చేపట్టాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్‌పై ఫోకస్ పెడ్తున్నారు.
భారీగా పెరగనున్న విస్తీర్ణం
హైదరాబాద్ సిటీలో కొత్తగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో నగర పరిధి 650 చదరపు కి.మీ. విస్తీర్ణం నుంచి సుమారు 2 వేల చదరపు కి.మీ.కు పెరగనున్నట్లుగా ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో హైదరాబాద్‌ను మెగా మెట్రోపాలిటన్ నగరంగా మార్చే దిశగా ముఖ్యమైన అడుగులు పడ్తున్నాయంటున్నారు. విస్తీర్ణం ప్రకారం ఇది దేశంలోనే అతిపెద్ద అర్బన్ లోకల్ బాడీలలో ఒకటిగా మారబోతున్నది. పెరుగుతున్న జనాభా, నగర విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేయడానికిరాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నది. మెగాసిటీలో బెంగుళూరు మోడల్‌గా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ సిస్టమ్ తీసుకురానున్నారు.
భూమిపై ఉన్న కరెంట్ స్థంభాలు, వైర్లను తొలగించి భూగర్భంలో వేయనున్నారు. దీనికి ఇప్పటికే రూ.4,051 కోట్లు మంజూరు చేసి.. త్వరలోనే పనులు మొదలు పెట్టనున్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చి ఓఆర్ఆర్ లోపల వినియోగించకుండా ఉన్న 9,292 ఎకరాల పాత ఇండస్ట్రియల్ ల్యాండ్‌లను మిక్స్డ్ యూజ్ జోన్లుగా మార్చి పెట్టుబడులను ఆకర్షించడం.. రెసిడెన్షియల్, కమర్షియల్‌గా అభివృద్ధి చేయడం... పబ్లిక్ అమెనిటీలైన పార్కుల కోసం భూములు కేటాయించడం వంటివి చేస్తున్నారు.
కోర్ అర్బన్ రీజియన్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ మెట్రో వాటర్ బోర్డ్, పవర్ యూటిలిటీలు సహా సమగ్రాభివృద్ధి ప్రణాళిక రెడీ చేస్తున్నారు. లైడార్ సర్వే చేసి లేజర్ ఆధారిత 3డీ మ్యాపింగ్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించడం. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, పొల్యూషన్ కంట్రోల్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి అతి కీలకమైన పనులు చేపట్టనున్నారు.
