- జాబితాలో భాగ్యనగరానికి ఐదో స్థానం
- 2033 నాటికి రీచ్ అయ్యే చాన్స్
- వివరాలు తెలిపిన గ్రోత్ హబ్స్ ఇండెక్స్
- లిస్ట్ లో నాలుగు భారతీయ నగరాలు
- ఫస్ట్ ప్లేస్ లో బెంగళూరు, మూడో స్థానంలో ఢిల్లీ, 8వ స్థానంలో ముంబై
హైదరాబాద్: సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 2033 నాటికి టాప్ టెన్ నగరాలపై అంచనా వేసింది. వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో హైదరాబాద్ కు చోటు లభించింది. సావిల్స్ సంస్థ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ జీడీపీ, వ్యక్తిగత సంపద, జనాభా పెరుగుదల , వలసలను ఆధారంగా తీసుకొని అంచనా వేసి ఆర్థిక పరిపుష్టి సాధించే నగరాలను ర్యాంకింగ్ చేస్తుంది. ఈ జాబితాలో ఇండియాకు చెందిన నాలుగు నగరాలు టాప్ టెన్ లో నిలిచాయి. బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ మూడో స్థానం లో నిలిచింది. హైదరాబాద్ ఐదో ప్లేస్ సాధించింది. భారత దేశ వాణిజ్య రాజధాని ముంబై 8వ ప్లేస్ లో ఉంది. భారత్ లోని నాలుగు నగరాలు 2033 నాటికి 68% కన్నా ఎక్కువ పెరుగుదలతో గణనీయమైన జీడీపీ సాధిస్తాయి. అభివృద్ది చెందుతున్న టెక్ హబ్ లు, నైపుణ్యం కలిగిన యువత, శ్రామిక శక్తి తదితరాలు హైదరాబాద్ ను ప్రపంచ భవిష్యత్ నగరాల జాబితాలో నిలపడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. రానున్న రోజుల్లో పట్టణీకరణ మరింత పెరిగే అవకాశ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టణాలకు వలసరావడం వల్ల ప్రతిభావంతులకు కొదవ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
2033 నాటికి వరల్డ్ టాప్ 10 నగరాలు ఇవే
1.బెంగళూరు ఇండియా
2.హో చి మిన్ సిటీ వియత్నాం
3. ఢిల్లీ ఇండియా
4. షెన్‌జెన్ చైనా
5. హైదరాబాద్ ఇండియా
6. హెనోయి వియత్నాం
7.గ్వాంగ్‌జౌ చైనా
8. ముంబై ఇండియా
9. మనీలా ఫిలిప్పీన్స్
10. రియాద్ సౌదీ అరేబియా