- దుండిగల్ బౌరంపేటలో ఘటన కొట్టి పోలీసులకు అప్పగింత
కుత్బుల్లాపూర్, వెలుగు: దుండిగల్ పీఎస్పరిధిలోని బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో కిడ్నాప్ఘటన కలకలం రేపింది. మంగళవారం ఇందిరమ్మ కాలనీలోకి వచ్చిన ఓ వ్యక్తి బాలికలకు చాక్లెట్స్ఇచ్చి కిడ్నాప్కి యత్నించాడని స్థానికులు అతడిని పట్టుకుని ప్రశ్నించారు.
పొంతన లేని సమాధానాలు ఇస్తుండడంతో చావబాదారు. దీంతో తీవ్రంగా గాయపడగా పోలీసులకు అప్పగించారు. విచారణలో తన పేరు సాధనాల వరప్రసాద్ అని మాత్రమే చెబుతున్నాడని, ఇతర వివరాలు చెప్పడంలేదని పోలీసులు చెప్పారు. గాయాలతో ఉండడంతో దవాఖానలో చేర్పించినట్టు తెలిపారు.
