రూ. 10 కోసం ప్రయాణికుడితో గొడవపడి ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన 2024 జూన్ 12 న శాలిబండలో ఈ సంఘటన జరిగింది, ఆటోడ్రైవర్ మహమ్మద్ అన్వర్ (39) చార్మినార్‌లో ప్రయాణికుడిని ఎక్కించుకుని షంషీర్‌గంజ్‌ని దింపాడు. ప్రయాణికుడు అన్వర్‌కు రూ.10 చెల్లించాడు. ఇంత కాదు మరో పది రూపాయలను ఇవ్వాలని ప్రయాణికుడిని అన్వర్ అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రయాణికుడు అన్వర్ ను గట్టిగా కొట్టాడు. దీంతో చుట్టుపక్కలవారు గుమిగూడడంతో ప్రయాణికుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలపాలైన అన్వర్‌ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అన్వర్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రయాణికుడిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
