
హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముందు ఆటో దగ్ధం అయ్యింది. ఆటో నుంచి మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలి పోయింది. డ్రైవర్ దూకడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
మహబూబ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ దేవా ప్రస్తుతం మియాపూర్ లో ఉంటున్నాడు. ఆర్ధిక ఇబ్బదుల వల్ల మనస్థాపానికి గురైన దేవా మధ్యం మత్తులో ప్రజా భవన్ ముందు పెట్రోల్ పోసి ఆటోకు నిప్పు పెట్టాడు. దీంతో ఆటో కాలిపోయింది. వెంటనే పోలీసులు ఆటో డ్రైవర్ దేవాను అదుపులోకి తీసుకున్నారు.