గార్డియన్స్ ట్రోఫీ విజేత ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యు-21 

గార్డియన్స్ ట్రోఫీ విజేత ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యు-21 
  •   ఫైనల్లో గోవాపై 3-1 తేడాతో ఘన విజయం

గోవా: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యు-21 జట్టు గార్డియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)కు చెందిన 10 ఫ్రాంచైజీ జట్ల మధ్య ఆగస్టు 14 నుంచి 16 వరకు గోవాలో జరిగిన టోర్నీలో హైదరాబాద్ జట్టు సత్తా చాటింది. ఫైనల్లో ఆతిథ్య గోవా జట్టును 3,-1తో ఓడించి చాంపియన్‌‌గా నిలిచింది. ఫైనల్‌‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ 15, -7, 11,-15, 16,-14, 15-, 8 స్కోర్లతో గోవాను ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో అహ్మదాబాద్‌‌పై 16-,14, 15,-9, 16-,14 స్కోర్లతో వరుసగా మూడు సెట్లలో విజయం సాధించి ఫైనల్‌‌కు అర్హత సాధించింది. ఫైనల్‌‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సార్థక్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‌గా నిలిచాడు. టోర్నమెంట్ మొత్తం సార్థక్ తన ప్రతిభను చాటుతూ మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ (ఎంవీపీ)తో పాటు బెస్ట్ అటాకర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆటగాళ్ల ప్రతిభకు మరో గుర్తింపుగా సార్థక్ సింగ్, దీపక్ గార్డియన్స్ ట్రోఫీ ఆల్-స్టార్స్ జట్టులో చోటు 
దక్కించుకున్నారు.