హైదరాబాద్, వెలుగు : ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసస్ అఖిల్ అలీభాయ్ హ్యాట్రిక్ విక్టరీతో మెరిశాడు. ఫార్ములా 4 ఇండియన్ ఓపెన్ నాలుగో రౌండ్‌లో తొలి రేసు గెలుపు జోరును కొనసాగిస్తూ ఆదివారం కోయంబత్తూర్‌లో జరిగిన రెండో, మూడో రేసుల్లోనూ విజేతగా నిలిచాడు.
రెండో రేసులో అఖిల్ అలీభాయ్ 26 నిమిషాల 16.904 సెకన్లలో టాప్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు. మూడో రేసులో (26 ని, 54.554 సె) అందరికంటే వేగంగా పోడియం ఫినిష్ చేసి టైటిల్ అందుకున్నాడు.