హైదరాబాద్‌లో ఓ CEO కి అశ్లీల ఫోటోలు పంపి వేధించిన..

హైదరాబాద్‌లో ఓ CEO కి అశ్లీల ఫోటోలు పంపి వేధించిన..

ఓ కంపెనీకి చెందిన మహిళ సీఈఓ ని వేధిస్తున్న వ్యక్తిని  హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.  ఆన్ లైన్ బిజినెస్ కంపెనీలో  సీఈఓ గా పనిచేస్తున్న మహిళను గతంలో అదే కంపెనీ లో పనిచేసిన, పాత ఉద్యోగి అయిన లక్ష్మీకాంత్.. నకిలీ ఈమెయిల్ ద్వారా వేధిస్తున్నాడు. నకిలీ ఈ మెయిల్ సృష్టించి, దాని ద్వారా అసభ్యకరమైన మెసేజ్ లు, అశ్లీల ఫోటోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు.  మహిళ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీ అడ్రెస్ ఆధారంగా అతని అడ్రస్ కనుక్కొని అరెస్ట్ చేశారు. లక్ష్మీకాంత్ చిక్కడపల్లి కి చెందినవాడిగా గుర్తించారు. ఇప్పటికే అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.