
వెలుగు, హైదరాబాద్ సిటీ : సిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయా చోట్ల జరిగిన వేడుకల్లో సిటీ జనం పెద్దఎత్తున పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత, శారీరకోల్లాసం, ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని వక్తలు తెలిపారు. యోగా దివ్య ఔషధం లాంటిదన్నారు. -