
రాణిగంజ్ డిపో బస్ టికెట్ మెషీన్ లో టెక్నికల్ ప్రాబ్లమ్
సికింద్రాబాద్, వెలుగు: సిటీ బస్సులో ఎంత దూరం వెళ్లినా వంద రూపాయల కంటే ఎక్కువగా టికెట్ ధరఉండదు. అయితే రాణిగంజ్డిపోకు చెందిన రూట్నెం. 219 బస్సు గురువారంఇన్సాపూర్నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. ఇన్సాపూర్ లో బస్సు ఎక్కిన ప్రయాణికుడు బాలానగర్ ఎక్స్ రోడ్ వరకు టికెట్ ఇవ్వమని కండక్టర్‌కు డబ్బులు ఇచ్చాడు. టికెట్ ఇచ్చిన తర్వాత చూసుకుంటే దానిపై రూ. 29,210గా ఉంది. దీంతో ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. తోటి ప్రయాణికులకు చూపించాడు. దీంతో కండక్టర్ అతడికి వేరే టికెట్ ఇచ్చారు. టికెట్ మెషీన్ లో టెక్నికల్ సమస్యతోనే తప్పుగా వచ్చిందని కండక్టర్ తెలిపారు. దీనిపై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని పేర్కొన్నారు.