స్టూడెంట్స్​కు రక్తహీనత టెస్టులు చేయండి : కలెక్టర్ అనుదీప్

స్టూడెంట్స్​కు రక్తహీనత టెస్టులు చేయండి : కలెక్టర్ అనుదీప్
  •     హైదరాబాద్ ​జిల్లాకలెక్టర్ అనుదీప్  

హైదరాబాద్, వెలుగు : జిల్లాలో 8 నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్​లో  పీహెచ్ఓ, సంక్షేమ శాఖ అధికారులు, విద్యాశాఖ , సంబంధిత అధికారులతో ముక్తి భారత్  కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

హైదరాబాద్ జిల్లాలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి, ఆర్ బీ ఎస్ కే టీములుగా ఏర్పడి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మైల్డ్,మోడరేట్, సీవియర్ గా ఉన్న పిల్లలుగా వేరు చేసి తగిన చికిత్స అందించాల్సిన అవసరముందని కలెక్టర్ స్పష్టంచేశారు. జిల్లా వైద్యాధికారి వెంకటి, డీఐఓ శ్రీకళ, బీసీ వెల్ఫేర్ అధికారి ఆశన్న, జిల్లా విద్యాధికారి రోహిణి,  అధికారులు పాల్గొన్నారు.