అమెరికా యూనివర్సిటీల్లో తగ్గిన భారత విద్యార్థుల అడ్మిషన్లు.. కానీ..

అమెరికా యూనివర్సిటీల్లో తగ్గిన భారత విద్యార్థుల అడ్మిషన్లు.. కానీ..

2024–25 విద్యా సంవత్సరంలో అమెరికాలోని యూనివర్సిటీలకు భారత విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గింది. అమెరికా రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓపెన్ డోర్స్” గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో భారత విద్యార్థుల నమోదు 10 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. ఈసారి మెుత్తం విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు 17 శాతం 2025లో తగ్గినట్లు డేటా వెల్లడించింది. 

సర్వేలో భాగమైన 825 అమెరికా సంస్థలలో 61 శాతం కంటే ఎక్కువ మంది భారత విద్యార్థుల సంఖ్య తగ్గిందని తెలిపాయి. వీటిలో 96 శాతం సంస్థలు విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణంగా వీసా ఫార్మాలిటీల్లో జాప్యం, కఠినమైన విధానాలు, అమెరికాకు ప్రయాణ పరిమితులను కారణాలుగా పేర్కొన్నాయి. అయితే ఇప్పటికీ అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందుతున్న విదేశీయుల జాబితాలో ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. 

 మొత్తం గ్రాడ్యుయేట్ విద్యార్థులలో దాదాపు సగం, అలాగే మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో మూడో వంతు భారతీయులే. గత ఏడాది ఇది పెరిగినప్పటికీ.. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ నిబంధనలతో ఈ సంఖ్య పడిపోయింది. అలాగే H-1B వీసా దరఖాస్తులపై దుర్వినియోగాల కేసుల్లో అమెరికా కార్మిక శాఖ 170కిపైగా దర్యాప్తు ప్రారంభించింది. దీనికి అదనంగా ఇటీవల వర్క్ వీసా కోసం లక్ష డాలర్ల చెల్లింపు రూల్స్ తీసుకురావటంతో అమెరికా కలలు చెదిరిపోతున్నాయి భారతీయ యువతలో. 

►ALSO READ | వచ్చే ఏడాది మార్కెట్లలో భారీ బుల్ జోరు.. మోర్గన్ స్టాన్లీ అంచనాలు ఇలా..

ఇదే క్రమంలో కన్సర్వేటివ్ రిపబ్లికన్ ఎమ్మెల్యేలు H-1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న ప్రతిపాదనలు తెచ్చారు. కాంగ్రెస్‌మెంబర్ మార్జరీ టేలర్ గ్రీన్, వైద్య రంగం మినహా అన్ని విభాగాల్లో H-1B వీసాలను నిషేధించే బిల్లు ప్రవేశపెడతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా రాష్ట్ర విభాగం రద్దు చేయటం కూడా డాలర్ డ్రీమ్స్‌కి ఇండియన్స్‌ని దూరం చేస్తోంది.